AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్కెట్‌లోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన 90స్ కిడ్స్ ఫేవరెట్ మోబైల్.. ఫీచర్స్ చూస్తే మతిపోవాల్సిందే!

కీప్యాడ్ ఫోన్స్ అనగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తొచ్చే బ్రాండ్ నోకియా. ఒకప్పుడు మొబైల్ ప్రపంచాన్ని ఏలిన ఈ దిగ్గజ బ్రాండ్ మళ్లీ మార్కెట్‌లోకి వచ్చేసింది. 90వ దశకం చివర్లో బాగా పాపులర్ అయిన 'నోకియా 3210' మోడల్‌ను, ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టు అప్‌డేటెడ్ ఫీచర్లతో 'HMD గ్లోబల్' మళ్లీ తీసుకొచ్చింది. మరి ఈ ఫోన్ ఫీచర్లు, ధర ఎంతో తెలుసుకుందాం పదండి.

మార్కెట్‌లోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన 90స్ కిడ్స్ ఫేవరెట్ మోబైల్.. ఫీచర్స్ చూస్తే మతిపోవాల్సిందే!
Hmd Nokia 3210
Anand T
|

Updated on: Sep 26, 2026 | 6:40 PM

Share

90వ దశకం చివర్లో, 2000 ప్రారంభంలో రిలీజైన నోకియా 3210 మొబైల్ గురించి తెలియని వారుండరు. అప్పట్లో మొబైల్ ప్రపంచాన్ని ఊపేసిన మోడల్ ఇది. ఈ ఫోన్ మార్కెట్‌లోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే భారీ స్థాయిలో అమ్ముడై రికార్డులు క్రియేట్ చేసింది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ ఫోన్.. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లతో పోటీ పడేందుకు అత్యాధునిక ఫీచర్లతో మళ్లీ మార్కెట్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ HMD దీనిని అద్భుతమైన ఫీచర్లతో మళ్లీ తీసుకొచ్చింది.

ఫోన్ లుక్, ఫీచర్లు

యూజర్లకు అప్పటి అనుభూతిని మళ్లీ అందించాలనే ఉద్దేశంతో, తయారీ సంస్థ ఈ మోడల్‌ను పాత రెట్రో డిజైన్, కీప్యాడ్‌తోనే మార్కెట్లోకి తీసుకొచ్చింది. చూడ్డానికి ఓల్డ్ మోడల్ కీప్యాడ్ ఫోన్‌లా కనిపిస్తున్నప్పటికీ.. ఇది ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా అత్యాధునిక ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌లో 2.4-అంగుళాల QVGA కలర్ డిస్‌ప్లే, LED ఫ్లాష్‌తో కూడిన 2-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, కనెక్టివిటీ కోసం 4G VoLTE, బ్లూటూత్ 5.0, టైప్-సి (Type-C) USB ఛార్జింగ్ పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను అందించారు. అలాగే 1,450 mAh రిమూవబుల్ బ్యాటరీని కూడా ఇందులో అమర్చారు.

అంతేకాదు, అప్పట్లో ఈ ఫోన్‌లో బాగా ఫేమస్ అయిన ‘స్నేక్ గేమ్’ను కూడా ఈ కొత్త మోడల్‌లో మళ్లీ తీసుకొచ్చారు. ఈ గేమ్‌తో వినియోగదారులు ఒక్కసారిగా తమ పాత జ్ఞాపకాల్లోకి వెళ్తారు. దీనిని కేవలం పాతకాలపు డిజైన్ ఫోన్‌గానే కాకుండా, ఒక అత్యుత్తమ బ్యాకప్ ఫోన్‌గా HMD తీర్చిదిద్దింది.

ధర, కలర్స్

ఇక ఈ ఫోన్ స్టోరేజ్ విషయానికి వస్తే.. ఇందులో 64 MB RAM, 128 MB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు ఎస్‌డీ (SD) కార్డు ఆప్షన్ కూడా ఇచ్చారు. అంతేకాదు క్యూఆర్ (QR) కోడ్ స్కాన్ చేసి, ఈ ఫోన్ ద్వారా యూపీఐ (UPI) చెల్లింపులు కూడా చేయొచ్చు. స్మార్ట్‌ఫోన్‌లకు కాస్త దూరంగా ఉండాలనుకునే వారికి, స్టూడెంట్స్‌కు, బ్యాకప్ ఫోన్ వాడుకోవాలని అనుకునే వారికి ఈ మొబైల్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. HMD ఈ ఫోన్‌ను స్కూబా బ్లూ, గ్రంజ్ బ్లాక్, Y2K గోల్డ్ అనే మూడు కలర్స్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఇక ధర విషయానికి వస్తే.. ఈ ఫోన్ ధరను రూ. 4,299గా నిర్ణయించారు.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మార్కెట్‌లోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన 90స్ కిడ్స్ ఫేవరెట్ మోబైల్
మార్కెట్‌లోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన 90స్ కిడ్స్ ఫేవరెట్ మోబైల్
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
నా పెళ్లికి గిఫ్టుగా ఆ టాలీవుడ్ డైరెక్టర్ డబ్బుల కవర్ పంపారు: లయ
నా పెళ్లికి గిఫ్టుగా ఆ టాలీవుడ్ డైరెక్టర్ డబ్బుల కవర్ పంపారు: లయ
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
లక్కీ డ్రాలో సీఎం రేవంత్ రెడ్డికి గణపతి లడ్డు.. అవాక్కైన జనం..
లక్కీ డ్రాలో సీఎం రేవంత్ రెడ్డికి గణపతి లడ్డు.. అవాక్కైన జనం..
రాజ పంచకంలో పుట్టిన పిల్లలు అదృష్టవంతులేనా? ఉద్యోగం, ఆస్తిలో..
రాజ పంచకంలో పుట్టిన పిల్లలు అదృష్టవంతులేనా? ఉద్యోగం, ఆస్తిలో..
Weekly Horoscope: ఈ రాశుల వారికి అదృష్టం ఖాయం..
Weekly Horoscope: ఈ రాశుల వారికి అదృష్టం ఖాయం..