Mahesh Babu: సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే మహేష్ బాబు ఓ స్టార్ హీరోకు ఫోన్ చేసి మాట్లాడిన విషయాన్నీ నటుడు బ్రహ్మాజీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉన్నారు నటుడు బ్రహ్మాజీ. హీరోగా కెరీర్ మొదలు పెట్టిన ఆయన ఆతర్వాత విలన్ గానూ నటించి మెప్పించారు. ఇక ఇప్పుడు సహాయక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఎన్నో సినిమాల్లో సహాయక పాత్రలో నటించారు బ్రహ్మాజీ.. ఈ మధ్యకాలంలో విడుదలవుతున్న సినిమాల్లో ఎదో ఒక పాత్రలో బ్రహ్మాజీ కనిపించి అలరిస్తూనే ఉన్నారు. కాగా గతంలో బ్రహ్మాజీ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. సినిమా ఇండస్ట్రీలో హీరోల గురించి.. వారి మధ్య ఉండే బాండింగ్ గురించి బ్రహ్మాజీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
బ్రహ్మాజీ మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, చిరంజీవి, నాగార్జున , వెంకటేష్.. వీళ్లందరి సినిమాల్లో నేనుంటాను. వీళ్ల కొడుకుల సినిమాల్లో కూడా ఉంటున్నాను. వీరందరూ చాలా మంచి వ్యక్తులు. జనాలు, ముఖ్యంగా అభిమాన సంఘాలు, వీళ్లకి వాళ్లకి పడదని అనుకోవడం వట్టిదే. ప్రతి సినిమా విడుదలైనప్పుడు ఒక పెద్ద సూపర్ స్టార్ మరొక హీరోకి ఫోన్ చేసి, ‘అదరగొట్టేశావ్, చాలా బాగా చేశావ్’ అని చెబుతాడు. డైరెక్టర్లు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది అభిమానులకు తెలియదు, వాళ్లు వైరం అనుకుంటారు అని బ్రహ్మజీ అన్నారు. ఉదాహరణగా, మహేష్ బాబు ‘జనతా గ్యారేజ్’ చూసి ఎన్టీఆర్‌కు ఫోన్ చేయడం, ఎన్టీఆర్ ‘శ్రీమంతుడు’ చూసి మహేష్ బాబుకు ఫోన్ చేయడం వంటివి జరిగాయని తెలిపారు.
ఇప్పటి జనరేషన్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి వారు చాలా సన్నిహితంగా ఉంటారని, పార్టీలు, ఫ్యామిలీ ఫంక్షన్లలో కలుసుకుంటారని బ్రహ్మాజీ అన్నారు. అంతకు ముందు జనరేషన్ నటులకు సమయం దొరకక కలవలేకపోవచ్చని, కానీ సందర్భం వస్తే వారూ చాలా స్నేహపూర్వకంగా ఉంటారని చెప్పారు. అలాగే ప్రస్తుత రోజుల్లో సినిమాల్లో ప్రవేశించడం సులువైందని, కానీ ప్రతిభ ఉన్నవారే నిలబడతారని అన్నారు. రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకులు చేసిన ప్రయోగాలు (5డి, ఐఫోన్‌తో సినిమా తీయడం వంటివి) ఎందరికో స్ఫూర్తినిచ్చాయని, తక్కువ బడ్జెట్‌లోనూ మంచి కంటెంట్‌తో సినిమాలు చేయవచ్చని చెప్పుకొచ్చారు బ్రహ్మాజీ.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




