Sampoornesh Babu: మరోసారి మంచి మనసు చాటుకున్న సంపూర్ణేశ్‌ బాబు.. గుండె జబ్బుతో బాధపడుతోన్న రెండు నెలల చిన్నారికి.

Sampoornesh Babu: సామాన్యుడు కూడా సెలబ్రిటీగా మారొచ్చని చాటి చెప్పిన వారిలో నటుడు సంపూర్ణేశ్‌ బాబు ఒకరు. హృదయ కాలేయంతో తెలుగు సినిమాతో వెండి తెరకు పరిచయమైన సంపూర్ణేశ్‌ బాబు.. కేవలం సినిమాలతోనే...

Sampoornesh Babu: మరోసారి మంచి మనసు చాటుకున్న సంపూర్ణేశ్‌ బాబు.. గుండె జబ్బుతో బాధపడుతోన్న రెండు నెలల చిన్నారికి.
Sampoornesh Babu
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 13, 2022 | 1:41 PM

Sampoornesh Babu: సామాన్యుడు కూడా సెలబ్రిటీగా మారొచ్చని చాటి చెప్పిన వారిలో నటుడు సంపూర్ణేశ్‌ బాబు ఒకరు. హృదయ కాలేయంతో తెలుగు సినిమాతో వెండి తెరకు పరిచయమైన సంపూర్ణేశ్‌ బాబు.. కేవలం సినిమాలతోనే కాకుండా సామాజిక సేవ కార్యక్రమాల ద్వారా కూడా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో చాలా సార్లు సంపూ తన మంచి మనసును చాటుకున్నారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం ఎప్పుడూ ముందుండే సంపూ తనకు తోచిన సాయాన్ని అందిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా సంపూర్ణేశ్‌ బాబు మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు.

సిరిసిల్ల రామన్నపేట గ్రామానికి చెందిన రెండు నెలల చిన్నారి శివ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. వైద్యానికి రూ. 10 లక్షలు ఖర్చవుతాయని డాక్టర్లు తెలిపారు. దీంతో గ్రామస్తులు అంతా విరాళాలు సేకరించారు. ఈ విషయం కాస్త సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్న సంపూర్ణేశ్‌ బాబు శనివారం రామన్నపేటకు వెళ్లారు. బాలుడి తల్లిదండ్రులు రమేశ్‌, లావణ్యలతో మాట్లాడిన సంపూర్ణేశ్‌ చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెంటనే రూ. 25 వేలు ఆర్థిక సాయాన్ని అందించారు.

సంపూర్ణేశ్‌ బాబు నేరుగా వచ్చిన డబ్బులు ఇవ్వడంతో బాలుడి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే సంపూర్ణేశ్‌ బాబు గతంలోనూ సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో తల్లిదండ్రులు మరణించి అనాథలుగా మారిన ఇద్దరు అమ్మాయిలకు ఆర్థిక సాయాన్ని అందించి అండగా నిలిచిన విషయం తెలిసిందే.

Sampoornesh Babu

Also Read: బాక్సాఫీస్ దగ్గర భీకరపోరు తప్పదా.. ఒకే రోజు రెండు బడా సినిమాల రిలీజ్..

Valenties Day: వాట్సాప్‌ స్టిక్కర్క్‌తో వాలంటైన్స్‌ డే విషెస్‌.. ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే..

Sarpanch Candidate Exam: అక్కడ సర్పంచ్ కావాలంటే.. ఈ రూల్స్ తప్పనిసరి.. ఎక్కడో తెలుసా!