Sarpanch Candidate Exam: అక్కడ సర్పంచ్ కావాలంటే.. ఈ రూల్స్ తప్పనిసరి.. ఎక్కడో తెలుసా!

ఒడిశాలోని ఆదివాసీలు అధికంగా ఉండే సుందర్‌ఘర్ జిల్లాలోని కుట్ర గ్రామ పంచాయతీ పరిధిలోని మలుపాడ గ్రామ ఓటర్లు అరుదైన ఉదాహరణగా నిలిచారు. పంచాయతీ ఎన్నికలకు ఎనిమిది మంది సర్పంచ్ అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించడం హాట్‌టాఫిక్‌గా మారింది

Sarpanch Candidate Exam: అక్కడ సర్పంచ్ కావాలంటే.. ఈ రూల్స్ తప్పనిసరి.. ఎక్కడో తెలుసా!
Election
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 13, 2022 | 11:49 AM

Voters Conduct Written test of Sarpanch Candidate: ఒడిశా(Odisha)లోని ఆదివాసీలు అధికంగా ఉండే సుందర్‌ఘర్(Sundargarh) జిల్లాలోని కుట్ర గ్రామ పంచాయతీ పరిధిలోని మలుపాడ గ్రామ ఓటర్లు అరుదైన ఉదాహరణగా నిలిచారు. పంచాయతీ ఎన్నికల(Panchayat Elections)కు ఎనిమిది మంది సర్పంచ్ అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించడం హాట్‌టాఫిక్‌గా మారింది. గ్రామస్తులు గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో సర్పంచ్ అభ్యర్థులు రాత పరీక్షకు హాజరుకావాలని కోరారు. గ్రామస్తుల ఈ చర్యను అభ్యర్థులు సైతం సరేనన్నారు. తొమ్మిది మంది అభ్యర్థులకు ఎనిమిది మంది పరీక్షకు హాజరయ్యారు. గ్రామస్తులు అభ్యర్థులను తమను తాము పరిచయం చేసుకోమని అడిగారు. సర్పంచ్ అభ్యర్థిగా వారి ఐదు లక్ష్యాలు వంటి కొన్ని సాధారణ ప్రశ్నలు అడిగారు. ఇందుకు సంబంధించి సరియైన సమాధానం చెప్పిన వారు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.

సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసే ముందు ఐదేళ్లలో తాను చేసిన సామాజిక సేవలను తెలపాలంటూ పరీక్ష పెట్టారు. సర్పంచ్ పదవికి ఓట్లు అడిగే ఉత్సాహంతో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నారా, ఇప్పటి వరకు చేపట్టిన ఐదు సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా రాయాలని అభ్యర్థులను కోరారు. చివరికి గ్రామస్థులు సమాధాన పత్రాలను పరిశీలించగా, ప్రస్తుత సర్పంచ్ లలితా బారువాతో సహా ముగ్గురు మాత్రమే సరియైన జవాబులు రాయడంతో ఉత్తీర్ణత సాధించారు.

మరికొద్ది రోజుల్లో మరో దఫా పరీక్ష నిర్వహించి వారిలో ఒకరిని సర్పంచ్‌ పదవికి ఎంపిక చేస్తామని గ్రామస్తులు తెలిపారు. పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఒకరైన జితేంద్ర టోప్పో మాట్లాడుతూ, పరీక్షలో ఉత్తీర్ణత సాధించని మరికొందరు ఇది కేవలం అవమానకరమని అన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాతే మా ఉద్దేశ్యానికి అసలు పరీక్ష. వ్రాత పరీక్ష దీన్ని ఎలా కొలవగలదు? అని ప్రశ్నించారు. గ్రామస్తులు తమ ఓటును బ్యాలెట్ బాక్స్‌లో వేస్తే ఎవరికి మెజార్టీ వస్తే వారు మాత్రమే సర్పంచ్ అవుతారన్నారు.

మలుపాడు గ్రామానికి చెందిన కీర్తి ఎక్కా మాట్లాడుతూ, “ఒక రోజు, గ్రామస్తులందరూ కలిసి కూర్చుని అలాంటి పరీక్ష నిర్వహించాలని నిర్ణయించుకున్నాము. దీని ప్రకారం, మేము ప్రశ్నలను సిద్ధం చేసాము. మరో గ్రామస్థురాలు మాధురి మింజా మాట్లాడుతూ, “సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత అభ్యర్థులు ఓట్లు అడిగేలా ఇంటింటికీ వెళ్లగలరా లేదా అని మేము తెలుసుకోవాలనుకున్నాము. అందుకే రాత పరీక్ష చేపట్టామన్నారు. పరీక్షకు హాజరైన సర్పంచ్ అభ్యర్థులు నువా సదంగా, లలితా బారువా గ్రామస్తుల ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయబోతున్నారో తెలుసుకోవడం ఓటర్ల హక్కు అని లలిత అన్నారు. అయితే రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున ఇలా జరగకూడదని బ్లాక్ ఎలక్షన్ ఆఫీసర్ రవీంద్ర సేథీ తెలిపారు. ఏదైనా ఫిర్యాదు అందితే విచారణ చేస్తాం అని తెలిపారు.

Read Also… RRI Recruitment 2022:  ఫిజిక్స్ పీహెచ్‌డీ చేసిన వారికి బంపరాఫర్!.. రామన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్ ఉద్యోగాలు..

దేవుడి ఉంగరాలు ధరిస్తున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
దేవుడి ఉంగరాలు ధరిస్తున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
ఆస్పత్రి బెడ్‌పై స్టార్ యాంకర్ స్రవంతి.. 40 రోజులుగా నరకమంటూ..
ఆస్పత్రి బెడ్‌పై స్టార్ యాంకర్ స్రవంతి.. 40 రోజులుగా నరకమంటూ..
నిద్ర లేమి సమస్యకు బెస్ట్ మెడిసిన్ ఈ పానీయాలు.. ట్రై చేసి చూడండి
నిద్ర లేమి సమస్యకు బెస్ట్ మెడిసిన్ ఈ పానీయాలు.. ట్రై చేసి చూడండి
Video: విరాట్‌ను చూసేందుకు చెట్లు ఎక్కిన అభిమానులు
Video: విరాట్‌ను చూసేందుకు చెట్లు ఎక్కిన అభిమానులు
హోండా కార్లపై తగ్గింపుల జాతర.. ఆ మోడల్స్‌పై నమ్మలేని ఆఫర్స్
హోండా కార్లపై తగ్గింపుల జాతర.. ఆ మోడల్స్‌పై నమ్మలేని ఆఫర్స్
ఇండియాలోనే ఉన్నానా.. నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్!
ఇండియాలోనే ఉన్నానా.. నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్!
ఆ స్టార్ హీరోను నమ్మి లక్షల్లో నష్టపోయాను..
ఆ స్టార్ హీరోను నమ్మి లక్షల్లో నష్టపోయాను..
ఆ డీఎస్సీ అభ్యర్థులకు ధ్రువపత్రాల పునఃపరిశీలన.. విద్యాశాఖ వెల్లడి
ఆ డీఎస్సీ అభ్యర్థులకు ధ్రువపత్రాల పునఃపరిశీలన.. విద్యాశాఖ వెల్లడి
హైకొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా..? ఈ 4 పదార్థాలను అస్సలు తినకండి
హైకొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా..? ఈ 4 పదార్థాలను అస్సలు తినకండి
కార్తీకపౌర్ణమి రోజున ఈ పరిహారాలు చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహం..
కార్తీకపౌర్ణమి రోజున ఈ పరిహారాలు చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహం..
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.