Punjab Elections 2022: అబద్ధాలతో ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు.. కేజ్రీవాల్‌పై పంజాబ్ సీఎం సంచలన కామెంట్స్..

Punjab Elections 2022: అబద్ధాలతో ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు.. కేజ్రీవాల్‌పై పంజాబ్ సీఎం సంచలన కామెంట్స్..

Punjab Elections 2022: అక్రమ మైనింగ్ ఆరోపణలపై క్లీన్ చిట్ పొందిన పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌..

Shiva Prajapati

|

Feb 13, 2022 | 11:33 AM

Punjab Elections 2022: అక్రమ మైనింగ్ ఆరోపణలపై క్లీన్ చిట్ పొందిన పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేజ్రీవాల్‌ను అబద్ధాలకోరు అంటూ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. తనపై కేజ్రీవాల్ చేసిన ఆరోపణల్లో ఒక్కటి కూడా నిజం లేదని అన్నారు. ‘నాపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణకు ఆదేశించారు. చివరకు నిజమే గెలిచింది.’’ అని చన్నీ పేర్కొన్నారు. కాగా, చమ్‌కౌర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ ఆరోపణలపై రోపర్ జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులు చన్నీకి క్లీన్ చిట్ ఇచ్చారు.

ఇదిలాఉంటే.. పంజాబ్‌లో పొలిటికల్ హీట్ పెరిగింది. అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నాయకులను బ్రిటీష్ పాలకులతో పోల్చారు చన్నీ. పంజాబ్‌ను దోచుకోవడానికే ఆప్ వచ్చిందని ఆరోపించారు. ‘‘బ్రిటీష్ వారు భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చారు. అదే విధంగా, కేజ్రీవాల్ ఆయన అనుచర వర్గం పంజాబ్‌ను దోచుకోవడానికి వచ్చారు. అబద్ధాల ఆధారంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు.’’ అని వ్యాఖ్యానించారు చన్నీ. ఇదిలాఉంటే.. చమ్‌కౌర్ సాహిబ్ సమీపంలోని జిందాపూర్ గ్రామంలో అక్రమ మైనింగ్‌లో చన్నీ పాత్రపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఆప్ రాష్ట్ర కో-ఇంఛార్జి రాఘవ్ చద్దా పంజాబ్ గవర్నర్ బన్వారీ లాల్ పురోహిత్‌కు మెమోరాండం సమర్పించారు. దీనికి స్పందించిన గవర్నర్.. విచారణ చేయాల్సిందిగా రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. గత నెలలో చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్ హనీ నివాస ప్రాంగణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రూ. 10 కోట్లకు పైగా ఆస్తుల పత్రాలు, 21 లక్షలకు పైగా విలువైన బంగారం, రూ. 12 లక్షల విలువైన రోలెక్స్ వాచ్‌ను స్వాధీనం చేసుకుంది.

పంజాబ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనుండగా, మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్రంలో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు పంజాబ్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ జరుగుతోంది. మరి ఈసారి ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Also read:

Valenties Day: వాట్సాప్‌ స్టిక్కర్క్‌తో వాలంటైన్స్‌ డే విషెస్‌.. ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే..

India Corona Updates: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 44,877 పాజిటివ్ కేసులు నమోదు..

IGNOU December 2021 TEE: మార్చి 4 నుంచి ఇగ్నో డిసెంబర్ 2021 TEE ప్రారంభం.. త్వరలో నోటిఫికేషన్‌..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu