IGNOU December 2021 TEE: మార్చి 4 నుంచి ఇగ్నో డిసెంబర్ 2021 TEE ప్రారంభం.. త్వరలో నోటిఫికేషన్‌..

ఇగ్నో డిసెంబర్ 2021 టర్మ్ ఎండ్ ఎగ్జామినేషన్లను(TEE) మార్చి 4 నుంచి నిర్వహించనున్నట్లు ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

IGNOU December 2021 TEE: మార్చి 4 నుంచి ఇగ్నో డిసెంబర్ 2021 TEE ప్రారంభం.. త్వరలో నోటిఫికేషన్‌..
Ignou Tee
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 13, 2022 | 11:17 AM

IGNOU December 2021 TEE Date: ఇగ్నో డిసెంబర్ 2021 టర్మ్ ఎండ్ ఎగ్జామినేషన్లను(TEE) మార్చి 4 నుంచి నిర్వహించనున్నట్లు ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం అన్ని ప్రోగ్రామ్‌లకు చెందిన పరీక్షలు మార్చి 4 నుంచి దేశ వ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాల్లో జరగనున్నట్లు తెలియజేసింది. కాగా కరోనా కారణంగా TEE డిసెంబర్ 2021 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు జనవరి 6 నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన తేదీలతో కూడిన వివరనాణ్మత షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామని తెల్పింది. పరీక్షల ప్రారంభానికి వారం రోజుల ముందు హాల్ టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు విద్యార్ధులకు సూచించింది. అభ్యర్థులు పరీక్షలకు సంబంధించిన ఇతర అప్‌డేట్‌ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ www.ignou.ac.inను తనిఖీ చేయాలని ఇగ్నో తెల్పింది.

Also Read:

AP Govt Jobs 2022: బీఎస్సీ/ఎమ్మెస్సీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. 2 రోజుల్లో ముగుస్తున్న గడువు!