AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Corona Updates: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 44,877 పాజిటివ్ కేసులు నమోదు..

India Corona Updates: దేశంలో థర్డ్ ప్రభావం తగ్గుముఖం పడుతోంది. ఫలితంగా రోజువారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. భారత వైద్యారోగ్య మంత్రిత్వ..

India Corona Updates: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 44,877 పాజిటివ్ కేసులు నమోదు..
Shiva Prajapati
|

Updated on: Feb 13, 2022 | 11:27 AM

Share

India Corona Updates: దేశంలో కరోనా థర్డ్ వేవ్(Corona Third Wave) ప్రభావం తగ్గుముఖం పడుతోంది. ఫలితంగా రోజువారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల(Coroan Positive) సంఖ్య తగ్గుతోంది. భారత వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ(Government of India) విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఇవాళ దేశ వ్యాప్తంగా 44,877 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా కేసులతో కలిపి దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,26,31,421కి పెరిగింది. కాగా, గత 24 గంటల్లో 684 మంది కరోనా ప్రభావంతో మరణించారు. దాంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య.. 5,08,665 లకు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,17,591 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,15,85,711 కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 5,37,045 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఇది మొత్తం కేసులలో 1.26 శాతం. రోజువారీ పాజిటివ్ రేటు 3.17 శాతంగా ఉంది. రికవరీ రేటు 97.55 శాతంగా ఉంది.

గడిచిన 24 గంటల్లో 49 లక్షల వ్యాక్సిన్‌ డోసులు.. దేశ వ్యాప్తంగా శనివారం నాడు 49,16,801 లక్షల మంది వ్యాక్సీన్ డోసులు వేసినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 1,72,81,49,447 వ్యాక్సీన్ డోసులు వేశారు.

Also read:

IGNOU December 2021 TEE: మార్చి 4 నుంచి ఇగ్నో డిసెంబర్ 2021 TEE ప్రారంభం.. త్వరలో నోటిఫికేషన్‌..

Viral Video: చిరుతపులితో మజాకా.. రక్తం కళ్లజూడాల్సిందే.. వైరల్‌ అవుతున్న వీడియో..

UNO Employees: యెమెన్‌లో ఐదుగురు ఐక్యరాజ్య సమితి ఉద్యోగుల కిడ్నాప్.. విడిపించేందుకు అధికారుల ప్రయత్నం!