DU Exams 2022: ఓపెన్ బుక్ మోడ్‌లో సెసిస్టర్ పరీక్షలు.. సెంట్రల్ యూనివర్సిటీ కీలక నిర్ణయం!
మార్చి/ఏప్రిల్, మే సెషన్లలో జరగనున్న సెమిస్టర్ పరీక్షలను ఓపెన్ బుక్(OBE), ఫిజికల్ మోడ్‌లో పరీక్షలను నిర్వహించాలని శుక్రవారం (ఫిబ్రవరి 11) యూనివర్సిటీ నిర్ణయించింది..
Delhi University Sem Exams 2022: ఎట్టకేలకు సెమిస్టర్ పరీక్షలను నిర్వహించాలని ఢిల్లీ యూనివర్సిటీ (DU) నిర్ణయం తీసుకుంది. మార్చి/ఏప్రిల్, మే సెషన్లలో జరగనున్న సెమిస్టర్ పరీక్షలను ఓపెన్ బుక్(OBE), ఫిజికల్ మోడ్‌లో పరీక్షలను నిర్వహించాలని శుక్రవారం (ఫిబ్రవరి 11) నిర్ణయించింది. తాజా నిర్ణయం ప్రకారం ఈ ఏడాది వర్సిటీ మార్చి, ఏప్రిల్ నెలల్లో నిర్వహించే అన్ని సెమిస్టర్ పరీక్షలను ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ మోడ్‌లో, మేలో నిర్వహించే పరీక్షలను ఫిజికల్ మోడ్‌లో నిర్వహించనుంది. అంటే I, III, V సెమిస్టర్ పరీక్షలు ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ మోడ్‌లో నిర్వహించబడతాయి. అలాగే II, IV, VI సెమిస్టర్ పరీక్షలు ఫిజికల్ మోడ్‌లో నిర్వహించబడతాయి. ఈ మేరకు అధికారిక నోటీసును యూనివర్సిటీ ట్విటర్ అకౌంట్‌లో పోస్టు చేసింది. వర్కింగ్ గ్రూప్ సిఫార్సుల ఆధారంగా పరీక్షల నిర్వహణ నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా తెలిపింది. దీనికి సంబంధించి వివరణాత్మక మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
కాగా అన్ని ఉన్నత విద్యా సంస్థలు తమ క్యాంపస్‌లను తిరిగి తెరవాలని, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లేదా బ్లెండెడ్ మోడ్‌లో పరీక్షలు, తరగతులను నిర్వహించాలని యూజీసీ (UGC) తెల్పిన విషయం తెలిసిందే! తాజా ఉత్తర్వుల మేరకు ఢిల్లీ విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 17 నుంచి అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించిన తరగతుల నిర్వహణకు క్యాంపస్‌ను పునఃప్రారంభించనున్నట్లు నిర్ణయించింది.
#Examinations @UnivofDelhi March/ April 2022 Examinations to be held in OBE mode for students of Semester I, III & V (Odd Semester). May 2022 Examinations will be held in physical mode for Semester II, IV, VI (Even Semester). Read notification here below: pic.twitter.com/TVIc16Do3O
— University of Delhi (@UnivofDelhi) February 11, 2022
Also Read: