AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goa Elections 2022: గోవాలో ఒకే దశలో రేపే పోలింగ్.. బరిలో 301 మంది అభ్యర్థులు

గోవాలోని 40 అసెంబ్లీ స్థానాలకు శనివారంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. రాష్ట్రంలోని 40 అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఒకే దశలో పోలింగ్ జరగనుంది. అయితే ఈసారి గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ గట్టిగానే ఉంది.

Goa Elections 2022: గోవాలో ఒకే దశలో రేపే పోలింగ్.. బరిలో 301 మంది అభ్యర్థులు
Goa
Balaraju Goud
|

Updated on: Feb 13, 2022 | 1:01 PM

Share

Goa Assembly Elections 2022: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండో దశలో ఉత్తరప్రదేశ్(Uttar Pradesh), ఉత్తరాఖండ్(Uttarakhand), గోవా(Gao) పోలింగ్‌కు సోమవారం జరుగనుంది. గోవాలోని 40 అసెంబ్లీ స్థానాలకు శనివారంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. రాష్ట్రంలోని 40 అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఒకే దశలో పోలింగ్ జరగనుంది. అయితే ఈసారి గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ గట్టిగానే ఉంది. అధికార పార్టీ భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో పాటు పలు విపక్షాల నుంచి గట్టి సవాలు ఎదురవుతోంది. వాస్తవానికి గోవా శాసనసభలో 40 సీట్లు ఉన్నాయి. అందులో ప్రస్తుతం బీజేపీకి 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (MGP), గోవా ఫార్వర్డ్ పార్టీ (GFP) కి చెందిన విజయ్ సర్దేశాయ్, మరో ముగ్గురు స్వతంత్రులు మద్దతు ఇస్తున్నారు. గోవా ఫార్వర్డ్ పార్టీ, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీలకు ఒక్కొక్కరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్‌కు 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

అయితే, ఈసారి గోవా అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 301 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో పాటు శివసేన కూటమి ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఈక్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ కూడా తన తండ్రి సాంప్రదాయ పనాజీ అసెంబ్లీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పనాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ రాకపోవడంతో బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ పనాజీ స్థానం నుంచి అటానాసియో బాబూష్ మాన్‌సెరేట్‌ను బరిలోకి దింపింది. ఇటీవలే, అటానాసియో’ బాబూష్ మోన్సెరాట్ మరో తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరారు. రాష్ట్ర ఎన్నికల రాజకీయాలలో పనాజీ అసెంబ్లీ స్థానానికి దాని స్వంత ప్రాముఖ్యత ఉంది. మాజీ కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పనాజీ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. మూడు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు.

గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు తమ బలాన్ని చాటుకుంటున్నాయి.కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం, గోవా ఇన్‌చార్జి దినేష్ గుండూరావుతో కలసి అసెంబ్లీ ఎన్నికల్లో ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో ప్రజల సంక్షేమానికి రాజకీయ ప్రత్యర్థులు అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఇది కాకుండా, బీజేపీ, కాంగ్రెస్, టిఎంసితో పాటు ఇతర రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాలలో చేసిన అభివృద్ధి పనులను హైలైట్ చేస్తూ వీడియో సందేశాలను పంచుకున్నారు.

ఇదిలా ఉంటే, ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అసెంబ్లీ ఎన్నికలకు పెద్ద వాగ్దానం చేశారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నగదు సాయంతోపాటు పలు వర్గాలకు ఇతర ప్రయోజనాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. అయితే, శివసేన నాయకుడు ఆదిత్య ఠాక్రే కూడా మహారాష్ట్రలోని సుపరిపాలన నమూనాను ఇతర అన్ని రాష్ట్రాల్లో పునరావృతం చేస్తామన్నారు.

Read Also…. Punjab Elections 2022: అబద్ధాలతో ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు.. కేజ్రీవాల్‌పై పంజాబ్ సీఎం సంచలన కామెంట్స్..