బాక్సాఫీస్ దగ్గర భీకరపోరు తప్పదా.. ఒకే రోజు రెండు బడా సినిమాల రిలీజ్..

బాక్సాఫీస్ దగ్గర భీకరపోరు తప్పదా.. ఒకే రోజు రెండు బడా సినిమాల రిలీజ్..
Kgf

ఇటీవల కాలంలో సినిమాల మధ్య పోటీ పెరిగిపోతుంది. కరోనా దెబ్బకు రిలీజ్ లు ఆగిపోవడంతో ఇప్పుడు అన్ని సినిమాలు ఒకే సారి విడుదల కానున్నాయి

Rajeev Rayala

|

Feb 13, 2022 | 12:48 PM

Vijay’s Beast : ఇటీవల కాలంలో సినిమాల మధ్య పోటీ పెరిగిపోతుంది. కరోనా దెబ్బకు రిలీజ్ లు ఆగిపోవడంతో ఇప్పుడు అన్ని సినిమాలు ఒకే సారి విడుదల కానున్నాయి. కరోనా ఆంక్షలు ఎత్తేసిన వెంటనే రిలీజ్ డేట్స్ ప్రకటించేశాయి చాలా సినిమాలు. ముఖ్యంగా బడా సినిమాలన్నీ వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా సమ్మర్ లో థియేటర్స్ లోకి అడుగుపెట్టనుంది. దానికంటే ముందే ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా కర్చీఫ్ వేసుకొని సిద్ధంగా ఉంది. ఇక మెగాస్టార్ ఆచార్య ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ లోగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో రెండు భారీ సినిమాలు పోటీకి బరిలో దిగనున్నాయని తెలుస్తుంది.

దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. దర్శకుడు సెల్వరాఘవన్ విలన్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను ఇంట్రస్టింగ్ కథతో తెరకెక్కిస్తున్నారట నెల్సన్. ఇక ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘బీస్ట్’ మూవీని ఏప్రిల్ 14న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట..ఇదిలా ఉంటే అదే రోజు కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ 2 సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. మొదటి భాగం సూపర్ సక్సెస్ అవడంతో.. రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ రెండు సినిమాలో ఒకే రోజు బాక్సాఫీస్ దగ్గర తలపడనున్నాయని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Amazon Youth Offer: యూత్‌ను టార్గెట్‌ చేస్తూ అమెజాన్‌ కొత్త ఆఫర్‌.. ప్రైమ్‌పై 50 శాతం డిస్కౌంట్‌..

Raviteja vs Rekha: స్టార్ హీరోపై డైరెక్ట్ భార్య సంచలన కామెంట్స్.. ఇంతకీ ఏం జరిగిందంటే..!

Lata Mangeshkar: లతా మంగేష్కర్ కు ఇష్టమైన కొత్తిమీర మటన్ కర్రీ తయారీ విధానం మీ కోసం..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu