Viral Photo: చెట్టును హత్తుకున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? ఇలా చేస్తే ఎన్నో లాభాలంటా..

Viral Photo: నటీమణులు సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. తమ అభి రుచుల నుంచి మొదలు అలవాట్ల వరకు అన్నింటినీ అభిమానులతో షేర్‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఓ అందాల తార ఇన్‌స్టాగ్రామ్‌లో..

Viral Photo: చెట్టును హత్తుకున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? ఇలా చేస్తే ఎన్నో లాభాలంటా..
Viral Photos
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 13, 2022 | 12:47 PM

Viral Photo: నటీమణులు సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. తమ అభి రుచుల నుంచి మొదలు అలవాట్ల వరకు అన్నింటినీ అభిమానులతో షేర్‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఓ అందాల తార ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫోటో వైరల్‌గా మారింది. నోటికి మాస్కు ధరించి, చెట్టును హత్తుకున్న ఫోటోను పోస్ట్‌ చేయడంతో ఆమె ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు. అయితే మాస్కు ధరించడంతో ఈ ఫోటోలో ఉన్న నటీమణి ఎవరో గుర్తుపట్టడం కాస్త కష్టంగా ఉంది. దీంతో ఈ ఫోటోను కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఈ నటీమణి ఎవరో గుర్తుపట్టండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ పైన ఫోటోలో కనిపిస్తోన్న హీరోయిన్‌ను మీరు గుర్తుపట్టారా.? అసలు అలా చెట్టును హగ్‌ చేసుకోవడానికి కారణమేంటో తెలుసా.?

ఈ ఫోటోలో ఉంది అందాల తార పాయల్‌ రాజ్‌పుత్‌. ఆర్‌క్స్‌ 100తో తెలుగు కుర్రకారుల మనసులను దోచుకున్న ఈ చిన్నది సోషల్‌ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది. తన లేటస్ట్‌ ఫోటోలతో నెటిజన్లు ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా పాయల్‌ ఒక చెట్టును హత్తకున్న సమయంలో దిగిన ఫోటోను ఇన్‌స్టా్గ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. అయితే పాయల్‌ ఇలా చెట్టును హత్తుకోవడం వెనక పెద్ద కారణమే ఉందడోయ్‌. చెట్లను హత్తుకోవడం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ పాయల్‌ క్యాప్షన్‌ రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal)

‘మీరు చెట్లను హత్తుకున్నప్పుడు, లేదా చెట్ల కింద కూర్చున్నప్పుడు రోగాలను తగ్గించే ఎనర్జీ లభిస్తుంది. జపాన్‌లో డిప్రెషన్‌, ఆతృత వంటి మానసిక రోగాలను తగ్గించడానికి ఫారెస్ట్‌ థెరపీని ఉపయోగిస్తుంటారు. సహజంగా రోగనిరోధక శక్తిని పెంచడానికి చెట్ల ఉపయోగపడతాయి. మీరు కూడా క్రమం తప్పకుండా ఇలా చేయండి, నేను గమనించినట్లే మీరూ స్పష్టమైన మార్పును గమనిస్తారు’ అంటూ చెట్లను హగ్‌ చేసుకోవడం వల్ల కలిగే లాభం గురించి చెప్పుకొచ్చింది పాయల్‌. పాయల్ చెబుతోంది వింటూంటే చిన్నప్పుడు చెట్ల కింద ఆడుకున్నప్పుడు కలిగిన ఆనందం గుర్తొస్తుంది కదూ.!

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal)

Also Read: Viral Video: చిరుతపులితో మజాకా.. రక్తం కళ్లజూడాల్సిందే.. వైరల్‌ అవుతున్న వీడియో..

Viral Video: విమానంలో అనుకోని అతిథి.. ఒక్కసారిగా షాక్‌ అయిన ప్రయాణికులు.. వైరల్‌ వీడియో.

Amit Shah in Punjab: పంజాబ్ ఎన్నికల ప్రచారానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కట్టుదిట్టమైన పోలీసుల భద్రతా ఏర్పాట్లు