Amazon Youth Offer: యూత్‌ను టార్గెట్‌ చేస్తూ అమెజాన్‌ కొత్త ఆఫర్‌.. ప్రైమ్‌పై 50 శాతం డిస్కౌంట్‌..

Amazon Youth Offer: ప్రస్తుతం ఓటీటీ సేవుల బాగా విస్తరిస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలు ఈ రంగంలోకి దిగడంతో తీవ్ర పోటీ పెరగింది. దీంతో యూజర్లను ఆకర్షించే క్రమంలో కంపెనీలు పలు ఆకర్షణీయ ఆఫర్లతో అట్రాక్ట్‌ చేస్తున్నాయి..

Amazon Youth Offer: యూత్‌ను టార్గెట్‌ చేస్తూ అమెజాన్‌ కొత్త ఆఫర్‌.. ప్రైమ్‌పై 50 శాతం డిస్కౌంట్‌..
Amozon Prime
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 13, 2022 | 6:46 AM

Amazon Youth Offer: ప్రస్తుతం ఓటీటీ సేవుల బాగా విస్తరిస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలు ఈ రంగంలోకి దిగడంతో తీవ్ర పోటీ పెరగింది. దీంతో యూజర్లను ఆకర్షించే క్రమంలో కంపెనీలు పలు ఆకర్షణీయ ఆఫర్లతో అట్రాక్ట్‌ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్త యూజర్లను ఆకర్షించే క్రమంలో మరీ ముఖ్యంగా యువత కోసం ఓ ఆఫర్‌ను ప్రకటించింది. 18-24 ఏళ్ల లోపు యువకులను టార్గెట్‌ చేస్తూ 50 శాతం వరకు క్యాష్‌ బ్యాక్‌ ఇచ్చే ఆఫర్‌ను తీసుకొచ్చింది.

యూత్‌ ఆఫర్‌లో భాగంగా అమెజాన్‌ ప్రైమ్‌లో చేరితో 50 శాతం బ్యాక్‌ వరకు క్యాష్‌ బ్యాక్‌ పొందే అవకాశం కలిపింది. ఇందుకోసం యూజర్లు ప్రైమ్‌ యాప్‌లోని రిఫరల్స్‌ పేజ్‌ నుంచి సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు మీ ఫ్రెండ్స్‌కు పంపించిన రిఫరల్‌ కోడ్‌తో సబ్‌స్క్రిప్షన్‌ చేసుకుంటే 15 రోజులు ఉచితంగా మెంబర్‌ షిప్‌ పొందే అవకాశం కల్పించారు. అంతేకాకుండా రిఫరల్ కోడ్ పంపించిన వారికి కూడా 60 శాతం క్యాష్‌బ్యాక్‌ పొందే అవకాశం కల్పించారు. అయితే ఇందుకోసం యూజర్లు తమ వయసును ధృవీకరణ చేసుకోవడానికి సెల్ఫీతో పాటు, అవసరమైన డ్యాక్యుమెంట్‌ సబ్‌మిట్‌ చేయాల్సి ఉంటుంది.

ఇక క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ల విషయానికొస్తే.. నెల రోజుల ప్యాక్‌లో భాగంగా రూ. 179ని సబ్‌స్క్రిప్షన్‌ చేసుకుంటే రూ. 90 క్యాష్‌బాక్‌తో పాటు రూ. 18 క్యాషన్‌బ్యాక్‌ను రిఫరల్‌ రివార్డ్‌గా పొందొచ్చు. అలాగే మూడు నెలలకుగాను రూ. 479లో రూ. 230 క్యాష్‌బ్యాక్‌తో పాటు రూ. 64 రిఫరల్‌ రివార్డ్‌ క్యాష్‌బ్యాక్‌ను పొందొచ్చు. ఇక ఏడాదికి గాను రూ. 1499పై రూ. 750 తోపాటు రూ. 150 రివార్డ్‌ క్యాష్‌బ్యాక్‌ను పొందొచ్చు. ఈ క్యాష్‌ బ్యాక్‌ మొత్తం అమెజాన్‌ పే అకౌంట్‌లో యాడ్‌ అవుతుంది.

Also Read: రాకింగ్ స్టార్ రాయల్ లుక్..

వాడో వెరైటీ దొంగ.. ఇంట్లో చొరబడతాడు.. ఇల్లంతా శుభ్రం చేసి వెళ్తాడు !! వీడియో

Yadadri Temple: ఏడేండ్ల కష్టానికి ఫలితం.. మరికొన్ని రోజుల్లో పునః ప్రారంభం కానున్న యాదాద్రి ఆలయం