Ranveer Singh: నాకు మగధీర హీరో రామ్ చరణ్ అంటే ఇష్టం.. ఆర్ఆర్ఆర్ కోసం ఎదురుచూస్తున్నా అంటున్న బాలీవుడ్ స్టార్ హీరో..

Ranveer Singh: ప్రస్తుత్రం బాలీవుడ్(Bollywood) దృష్టి టాలీవుడ్(Tollywood) పై పడింది. బాలీవుడ్ నటీనటులు దక్షిణాది సినిమాల్లో నటించడానికి.. లేదా వాటిని రీమేక్ చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు..

Ranveer Singh: నాకు మగధీర హీరో రామ్ చరణ్ అంటే ఇష్టం.. ఆర్ఆర్ఆర్ కోసం ఎదురుచూస్తున్నా అంటున్న బాలీవుడ్ స్టార్ హీరో..
Ranveer Sing Alia Bhatt
Follow us
Surya Kala

|

Updated on: Feb 13, 2022 | 10:29 PM

Ranveer Singh: ప్రస్తుత్రం బాలీవుడ్(Bollywood) దృష్టి టాలీవుడ్(Tollywood) పై పడింది. బాలీవుడ్ నటీనటులు దక్షిణాది సినిమాల్లో నటించడానికి.. లేదా వాటిని రీమేక్ చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన అలియా భట్ ప్రధాన పాత్రలో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిన ‘గంగూబాయి కతియావాడి ‘ రిలీజైంది. మరోవైపు త్వరలో రిలీజ్ కానున్న ఆర్ఆర్ఆర్ సినిమా గురించి వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈ రెండు సినిమాల్లోని సాంగ్స్ కూడా ప్రేక్షకులనే కాదు.. సెలబ్రేటీలను సైతం ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో ప్రముఖ బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ఈ పాటలకు డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. గంగూబాయి , ఆర్.ఆర్ పాటలకు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న వీడియోలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి.

RRRలోని ‘నాటు-నాటు’ సాంగ్ రణ్‌వీర్ సోషల్ మీడియా లైవ్ సెషన్‌లో ‘RRR’లోని ‘నాటు-నాటు’ పాటను ప్రస్తావించాడు. అంతేకాదు తనకు మగధీర అంటే ఇష్టమని.. రామ్ చరణ్ అంటే మరింత ఇష్టమని చెప్పాడు. అంతేకాదు నాటు నాటు అంటూ హమ్ కూడా చేశాడు.  రెడ్ హూడీ వేసుకుని కారులో కూర్చున్న రణవీర్, ఆ సమయంలో ఎంజాయ్ చేయాలనే మూడ్‌లో కనిపించడం, కారులో లైట్ వెలుతురు, బిగ్గరగా సంగీతం వినిపిస్తుంది.. ఇది వీడియోలో చూడవచ్చు. కారులో రణవీర్ భార్య, నటి దీపికా నటిస్తున్న ‘గహ్రైయాన్’ చిత్రంలోని పాట వినిపిస్తోంది. ఈ సమయంలో.. రణవీర్ లైవ్ లో మాట్లాడుతూ.. తాను అలియా యొక్క RRR చిత్రం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. రణవీర్ ని సౌత్ ఇండస్ట్రీని బాగా ఆకట్టుకున్నదని.. రాబోయే రోజుల్లో రణ్‌వీర్ సౌత్ సినిమాల్లోకి కూడా అడుగు పెట్టవచ్చునేమో అంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

మరోవైపు, రణ్‌వీర్ మరొక వీడియో బయటపడింది, అందులో అలియా భట్‌తో కలిసి ‘గంగూబాయి కతివాడియా’లోని ‘ధోలిడా’ పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు. అలియా తెల్లటి షిఫాన్ మిక్స్ చీర కట్టుకుని జడలో పువ్వులు పెట్టుకుని నిలబడి ఉంది, రణ్‌వీర్ ఆలియా సినిమాలోని ధోలిడా పాటకు డ్యాన్స్ చేయడం ప్రారంభించినప్పుడు, రణ్‌వీర్ అలియాలా నటించాడు. అప్పుడు అలియా అతని కొంటె స్టైల్ చూసి నవ్వుకుంటుంది. అనంతరం ఇద్దరూ కలిసి ఈ పాటకు ఎంతో హుషారుగా స్టెప్స్ వేశారు.

Read Also :

 భర్తను చితగ్గొట్టిన హాసినీ.. నెట్టింట్లో వైరల్ గా మారిన వీడియో..

 శబరిమల అయ్యప్ప స్వామి సేవలో చిరంజీవి దంపతులు.. డోలీలో స్వామి సన్నిధికి చేరుకున్న మెగాస్టార్‌..