Birth Anniversary: అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ చిత్రపరిశ్రమలో మధుబాలను మించిన సౌందర్యరాశి లేదు.. ఇక రాదు..

అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ ఆ సౌందర్యం అజరామరం. ఆ అందం ఒకప్పుడు కోట్లాది మందిని పిచ్చివాళ్లను చేసింది. ఆ అందానికి మరో పేరు మధుబాల.. నేటికీ సినీ ప్రేమికులను తన . ఆమె ఒక భారతీయ నటి..

Birth Anniversary: అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ చిత్రపరిశ్రమలో మధుబాలను మించిన సౌందర్యరాశి లేదు.. ఇక రాదు..
Legendary Actress Madhubala
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 14, 2022 | 11:24 AM

అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ ఆ సౌందర్యం అజరామరం. ఆ అందం ఒకప్పుడు కోట్లాది మందిని పిచ్చివాళ్లను చేసింది. ఆ అందానికి మరో పేరు మధుబాల.. నేటికీ సినీ ప్రేమికులను తన . ఆమె ఒక భారతీయ నటి. 40, 50 లలో గొప్ప నటిగా గుర్తింపు పొందింది. మధుబాల బ్రిటిష్ కాలంలో భారతదేశంలోని న్యూఢిల్లీలో 1933 ఫిబ్రవరి 14న జన్మించారు. మధుబాల గా సినీ ప్రేక్షకులకు ముఖ్యముగా పాత తరము వారికి బాగా పరిచయము ఉన్న ఈ హీరోయిన్ అసలు పేరు ముంతాజ్ జెహాన్ బేగం దెహ్లావీ ఈవిడ ఫిబ్రవరి 14(ప్రేమికులరోజు) 1933 న అతుల్లాహ్ ఖాన్, అయేషా బేగము దంపతులకు పదకొండు మంది సంతానంలో ఐదవ సంతానంగా ఢిల్లీలో జన్మించింది. పష్టూన్ ముస్లిం కుటుంబంలో పుట్టిన మధుబాల ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. నిజానికి 1942లో ‘బసంత్‌ ’ సినిమాతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఆ సమయంలో ఆమె వయస్సు కేవలం 9 సంవత్సరాలు. కానీ నటిగా, ఆమె 1947 సంవత్సరంలో ‘నీలకమల్’ చిత్రంలో కనిపించారు. సినిమాను నిర్మాత కేదార్ శర్మ  రూపొందించారు. ఈ సినిమా తర్వాత 1947లో ‘దిల్ కి రాణి’, 1948లో ‘అమర్ ప్రేమ్’ సినిమాల్లో పనిచేశారు. ఈ సినిమాలన్నీ రాజ్‌కపూర్‌తో చేశాడు.

మధుబాల చిన్ననాటి పేరు ముంతాజ్ బేగం జహాన్ డెహ్ల్వి. ఆమె తల్లిదండ్రులకు ఐదవ సంతానం. మధుబాలతో పాటు ఆమెకు మరో 10 మంది తోబుట్టువులు ఉన్నారు. కానీ ఆమె 5గురు సోదరీమణులలో అందరి కంటే అందంగా ఉండేది. ఆమె చిన్న వయస్సులోనే సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. ఈ కారణంగా ఆమె పాఠశాలకు వెళ్లలేకపోయారు. మొదట్లో మధుబాలకు ఉర్దూ బాగా వచ్చినప్పటికీ ఇంట్లో వాళ్ళ సొంత భాష పాష్తో మాట్లాడేది ఇంగ్లిష్ అసలు వచ్చేది కాదు కానీ తరువాత ఇంగ్లిష్ క్లాసులు తీసుకొని బాగా నేర్చుకొని ఇంగ్లీష్ ధారాళముగా మాట్లాడేది అలాగే 12 ఏళ్ల వయస్సులోనే డ్రైవింగ్ నేర్చుకున్నది.

ఇండియన్ సినిమాకు ఈవిడ వీనస్ క్వీన్ లాంటిది అని చెప్పాలి. ఆ రోజుల్లో ఈవిడను ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ మార్లిన్ మన్రో తో పోల్చేవారు. అంతేకాదు మార్లిన్ మన్రో ఆఫ్ బాలీవుడ్ అని కీర్తించేవారు బీ టౌన్ అభిమానులు. ఆవిడ టైం లో ఆవిడ చాలా పేరున్న కథానాయకి అప్పట్లో మీనాకుమారి, సురయ వంటి అగ్ర కథానాయికల సరసన ఈవిడ పేరు వినిపించేది.. అందంలో మటుకు ఈవిడదే ప్రథమ స్థానము అని చెప్పాలి.. కాబట్టే 1951 లో హాలీవుడ్ ఫోటోగ్రాఫర్ జేమ్స్ బర్కి ఇండియా వచ్చినప్పుడు అయన దృష్టిని ఆకర్షించింది. అప్పట్లో అయన మధుబాలకు తీసిన ఫోటోఆగస్టు 1952లైఫ్ పత్రిక కవర్ పేజీగా వచ్చింది.

అంతేకాకుండా ఆ సంచికలో బిగ్గెస్ట్ స్టార్ ఆఫ్ డా వరల్డ్ అనే వ్యాసము కూడా మధుబాల గురించి వచ్చింది. ఆ వ్యాసములో చివర మధుబాల దురదృష్ట వశాత్తు బెవర్లీ హిల్స్ లో లేదు అని కూడా వ్రాశారు. అప్పటి వరకు ఏ భారతీయ చలన చిత్ర నటి నటుల ఫోటోలను లైఫ్ పత్రిక ప్రచురించలేదు. పొగుడుతూ వ్యాసం కూడా వ్రాయలేదు. ఆ విధంగా ఆవిడ అందం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఆ ఆవిడను బిగ్గెస్ట్ స్టార్ గా అంతర్జాతీయ సినీ పరిశ్రమ పొగిడింది.

12 ఏళ్ల వయస్సులోనే డ్రైవింగ్ నేర్చుకున్నది. లాంగ్ డ్రైవ్ లంటే మధుబాలకు ఇష్టముగా ఉండేది. 1947 నుంచి కథానాయకిగా కెరీర్ మొదలు పెట్టారు. 14 ఏళ్ల వయస్సులోనే రాజ్ కపూర్‌తో “నీల్ కమల్” అనే సినిమాలో హీరోయిన్ గానటించారు. ప్రముఖ నటి దేవికా రాణి మధుబాల నటనకు ముగ్దురాలై మెచ్చుకొని వెండితెర పేరు మధుబాలగా ఉంచుకోమని సలహా ఇచ్చింది. అప్పటి నుండి మధుబాల పేరుతొ పాపులర్ అయింది.

దిలీప్ కుమార్‌తో మధుబాల ప్రేమ..

మధుబాల ఆ కాలంలో ‘బాంబే టాకీస్’, ‘మహల్’ వంటి పెద్ద చిత్రాలలో కూడా నటించింది. 1944లో మధుబాల ‘జ్వర్ భట’ సినిమా సెట్‌లో నటుడు దిలీప్ కుమార్‌ను కలిశారు. ఆ తర్వాత మధుబాల మనసులో దిలీప్ కుమార్ పై ప్రేమ చిగురించింది. అప్పటికి మధుబాల వయసు 18 ఏళ్లు కాగా, దిలీప్ కుమార్ వయసు 21 ఏళ్లు. 1951లో మరోసారి వీరిద్దరూ కలిసి ‘తరణ’ చిత్రంలో నటించారు.

‘మొఘల్-ఎ-ఆజం’ షూటింగ్ 9 సంవత్సరాల సుదీర్ఘ సమయం పట్టిందని.. ఈ సమయంలో వారిద్దరి ప్రేమ మరింత లోతుగా సాగిందని అంటున్నారు. మధుబాల దిలీప్ కుమార్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ దిలీప్ కుమార్ నిరాకరించారు. అయితే, దిలీప్ కుమార్ పెళ్లికి సిద్ధంగా ఉన్నారని.. అయితే మధుబాల కుటుంబం ఈ సంబంధానికి వ్యతిరేకించారని అంటున్నారు. 1958లో అయతుల్లా ఖాన్ కూడా దిలీప్ కుమార్‌పై కోర్టులో కేసు వేశారు. దీని కారణంగా అతను ఈ ఇద్దరి ప్రేమ వ్యవహారాన్ని ముగించాలనుకున్నాడు.

దిలీప్ కుమార్ మాత్రమే కాకుండా కిషోర్ కుమార్ కూడా తనను మోసం చేశారని ఓ ఇంటర్వ్యూలో మధుబాల సోధరి వెల్లడించింది. మధుబాల అనారోగ్యంతో బాధపడుతూ.. చికిత్స కోసం లండన్ వెళ్లాలనుకున్నప్పుడు కిషోర్ కుమార్ ఆమెకు ప్రపోజ్ చేశారని తెలిపింది. పూర్తిగా కోలుకున్న తర్వాతే వైద్యుల సలహా తీసుకుని పెళ్లి చేయాలని మధుబాల తండ్రి భావించగా.. దిలీప్ సాహబ్ తీరుపై ఆగ్రహించిన మధుబాల వెంటనే కిషోర్ కుమార్ ను పెళ్లి చేసుకుంది. సమయంలో 27 సంవత్సరాల వయస్సులో (1960) ఆమె వివాహం చేసుకున్నారు.

అత్యధికంగా నర్గీస్‌తో దిలీప్ కుమార్ ఏడు సినిమాలు చేశారు. కానీ దిలీప్‌కు సరిజోడి ఎవరంటే.. అందరూ మధుబాలా పేరే చెబుతున్నారు. మధుబాల అంటే తనకు చాలా ఇష్టమని తన జీవిత చరిత్ర ‘‘ద సబ్‌స్టాన్స్ అండ్ ద షాడో’’లో దిలీప్ కుమార్ వెల్లడించారు. మధుబాలలో కళ ఉట్టిపడుతుండేది.. తను చాలా చలాకీ అమ్మాయి.. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోగలదని దిలీప్ కుమార్ అంటూ ఉండేవారు.

గుండె జబ్బుతో..

ఆమె ఎక్కువ రోజులు బతకదని వైద్యులు చెప్పడంతో కిషోర్ కుమార్ సోదరుడు ముంబైలోని కార్టర్ రోడ్డులో ఓ బంగ్లాను కొనుగోలు చేసి నర్సు, డ్రైవర్ సహాయంతో అక్కడే ఉంచారు. అతను నాలుగు నెలలకు ఒకసారి సందర్శించేవారు. మధుబాల ఫోన్ తీయడం కూడా మానేశారు. అప్పుడు తనను కలవడానికి ఎవరూ రావడం లేదని మధుబాల చాలా ఆందోళన వ్యక్తం చేశారు.

ఒకప్పుడు బాలీవుడ్ బెస్ట్ యాక్ట్రెస్‌గా పేరు తెచ్చుకున్న ఈమె అనారోగ్యానికి గురై మృత్యువు అంచున ఉన్నప్పుడు ఆమెను కలవడానికి.. ఆమె పరిస్థితిని తెలుసుకోవడానికి కూడా ఎవరు కూడా అటువైపు రాలేదు. ఆ రోజుల్లో మధుబాల కూడా నిత్యం తయారవడం మానేశారు. ఆమె ఎప్పుడూ నైట్ గౌనులోనే ఉండేవారు. మధుబాల 23 ఫిబ్రవరి 1969న కేవలం 36 ఏళ్ల వయసులో మరణించారు. 

ఇవి కూడా చదవండి: UP Assembly Election 2022 Voting Live: ఆ మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం.. సమరంలో హేమా హేమీలు..

PSLV-C52: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ52 రాకెట్.. ఇస్రో ఈ ఏడాది తొలి ప్రయోగం సక్సెస్..

పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!