Rakhi Sawant: వాలెంటైన్స్ డేకు ఒక్కరోజు ముందే బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ట్విస్ట్.. భర్తతో విడిపోతున్నట్లుగా ప్రకటన..
వాలెంటైన్స్ డేకు ఒక్కరోజు ముందుగానే బిగ్‌బాస్ బ్యూటీ షాకిచ్చింది. తన భర్తతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
వాలెంటైన్స్ డేకు ఒక్కరోజు ముందుగానే బిగ్‌బాస్ బ్యూటీ షాకిచ్చింది. తన భర్తతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. హిందీ బిగ్‌బాస్ సీజన్ 15 కంటెస్టెంట్ రాఖీ సావంత్ (Rakhi Sawant) తన భర్తతో విడిపోతున్నట్లు నిన్న రాత్రి తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. బిగ్‌బాస్ షో అనంతరం పరిస్థితులు మారిపోవడం వలన తన భర్త రితేష్‌తో విడిపోవడానికి నిర్ణయించుకున్నట్లు రాఖి సావంత్ తెలిపింది. తమ మధ్య ఏర్పడిన గొడవలను పరిష్కరించుకునేందుకు శక్తికి మించి ప్రయత్నించిన ఫలితం లేదని.. చివరకు విడిపోవడానికి సిద్దపడినట్లు రాఖీ తెలిపింది.
” ప్రియమైన అభిమానులు.. శ్రేయోభిలాషులు.. నేను రితేష్ విడిపోవాలని నిర్ణయించుకున్నాం. బిగ్‌బాస్ షో తర్వాతా నాకు తెలియకుండా… నా నియంత్రణలో లేనివి చాలా జరిగాయి. మేము మా ఇద్దరి మధ్య ఏర్పడిన విభేధాలను, గొడవలను పరిష్కరించుకోవడానికి చాలా ప్రయత్నించాము. చివరకు మేమిద్దరం విడిపోవడానికి నిర్ణయించుకున్నాం. ఇక పై మేము మా జీవితాలను వేరు వేరుగా కొనసాగిస్తాము. వాలెంటైన్స్ డేకు ఒక్కరోజు ముందుగా ఇది జరిగినందుకు చాలా బాధగా ఉంది. కానీ నిర్ణయం తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చింది. రితేష్ జీవితంలో ఉత్తమంగా ఉండాలని కోరుకుంటున్నాను.. ఈ పరిస్థితులలో నేను నా కెరీర్ పై దృష్టి పెట్టాలి. ఇకపై నేను సంతోషంగా… ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను.. ఎల్లప్పుడూ నన్ను అర్థం చేసుకుని మద్దతు ఇస్తున్నందుకు అభిమానులకు ధన్యవాదాలు” అంటూ సుధీర్ఘ పోస్ట్ చేసింది రాఖీ సావంత్.
రాఖీ సావంత్ బిగ్‌బాస్ సీజన్ 14లో పాల్గోన్నప్పుడు తన భర్త రితేష్‌ను పరిచయం చేసింది. గతంలో రితేష్‌కు స్నిగ్ధప్రియతో వివాహం జరగగా.. వీరికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు.. అయితే తనకు వివాహం జరిగిందన్ని విషయాన్ని దాచి పెట్టి రాఖీ సావంత్‍ను వివాహం చేసుకున్నాడని.. వీరి పెళ్లి చెల్లదని గతంలో రితేష్ మొదటి భార్య ఆరోపించింది.
View this post on Instagram
Viral Video: కోతా మజాకా.. చిరుతపులిని ముప్పు తిప్పలు పెట్టిందిగా.. చివరకు.
Actor Photo: ఈ ఫోటోలో ఉన్న చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో.. అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఎక్కువ..