AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valentine’s Day 2022: ప్రేమ.. అంతులేని అనిర్వచనీయ భావాల సంగమం.. మాటలకందని భావాలను మనసులోని వారికి తెలియజేయండిలా..

Valentine’s Week 2022: ప్రేమ.. రెండు మనసుల కలయిక. గుండెలో దాగివున్న లక్షల భావాలను మనసులోని వారికి చెప్పేది. అది మాటలకందని ఓ మధురానుభుతి.

Valentine’s Day 2022: ప్రేమ.. అంతులేని అనిర్వచనీయ భావాల సంగమం.. మాటలకందని భావాలను మనసులోని వారికి తెలియజేయండిలా..
Valentine's Day
Rajitha Chanti
| Edited By: Anil kumar poka|

Updated on: Feb 14, 2022 | 5:17 PM

Share

Valentine’s Week 2022: ప్రేమ.. రెండు మనసుల కలయిక. గుండెలో దాగివున్న లక్షల భావాలను మనసులోని వారికి చెప్పేది. అది మాటలకందని ఓ మధురానుభుతి. జీవిత ప్రయాణంలో కడవరకు తోడుండేవారికి మీ మనసులో గూడుకట్టుకున్న అమితమైన ప్రేమను తెలియజేయడానికి ప్రత్యేకమైన రోజు. ప్రేమ.. అంతులేని అనిర్వచనీయ భావాల సంగమం. ప్రేమ ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మధురమైన క్షణాలను అందిస్తుంది. కష్టసుఖాల్లో తోడుండేవారికి మీ మనసులో స్థానం కల్పిస్తుంది. ఎంతో మంది.. తమ ఎదలో దాచుకున్న భావాలను మనసులోని వారికి తెలియజేయడానికి అద్భుతమైన రోజు ఈ వాలెంటైన్స్ డే. రోజ్ డే మొదలుకొని చివరి రోజు ప్రేమికుల రోజు వరకు ప్రతి రోజును ప్రత్యేకంగా జీవితంలో ఓ మధురానుభూతిగా మలుచుకుంటారు. ఇక చివరి రోజు ప్రేమికుల రోజున తమ భాగస్వామికి.. మీ ప్రేమను అక్షరాలుగా మార్చి తెలియజేయండి. అందుకు మీకోసం ఈ అందమైన కోట్స్.

ప్రేమకు అడ్డుగోడలు.. హెచ్చుతగ్గులు లేవు. అంతఃపురంలో ఉండే రాజైనా..పూరిగుడిసెలో ఉండే అబ్బాయి అయినా.. ఏదో ఒక దశలో ప్రేమలో పడినవారే ఉంటారు. ప్రేమకు అంతులేనంగా ప్రేమించడం మాత్రమే కాదు.. ఎంతటి త్యాగానికైనా సిద్ధమైపోతుంది. తమకు ఇష్టమైన వారికోసం ఏం చేయడానికైనా సై అనేలా చేస్తుంది. ప్రేమ.. మనసుకు దైర్యానిస్తుంది. అదే ప్రేమ దూరమైతే ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కోనే ధైర్యాన్నిస్తుంది. ఒక్కసారి ప్రేమలో ఒడిపోయిన వారికి అంతులేని దైర్యాన్ని ఇవ్వడమే కాకుండా.. మనసులోని నమ్మకాన్ని సైతం చెరిపేసి నిశితంగా మార్చేస్తుంది. ప్రేమ ఓ నమ్మకం.. భరోసా. అబ్బాయి, అమ్మాయికి మాత్రమే కాకుండా.. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వారికి… అన్న చెల్లెల్లకు.. అన్నతమ్ముళ్లకు.. తల్లిదండ్రులు, పిల్లలకు ఇలా అందరి మధ్య ఉన్న ప్రేమను తెలియజేయడానికి ప్రత్యేక మైన రోజే ఇది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీకు ఇష్టమైనవారికి ఈ ప్రేమికుల రోజు అంకితం చేస్తూ మీ మనసులో వారిపై ఉన్న ఇష్టాన్ని అక్షరాలు మలచి తెలియజేయండి. అందుకోసం ఈ కోట్స్.

ఎటో తెలియని దారులలో ఎవరికైనా నడిచెనో.. గమ్యం తెలియని తీరంలో కొట్టుకునే నావనో.. ఎగసే అలల తాకిడికి గురైన తీరంనో.. ఏమని వర్ణించను నిన్ను.. ఎలా వర్ణించను నిన్ను.. ప్రేమికుల రోజు శుభాకాంక్షలు..

నువ్వు ఉన్నావనే భరోసానే నన్ను బ్రతికేలా చేస్తుంది.. నీతోడు నన్ను భవిష్యత్తు గురించి ఆలోచించేలా చేస్తుంది.. దారులు వేరైనా.. నాకోసం నీ దారి మార్చుకుని.. నా జీవితానికి సంతోషాన్ని అందించిన నిన్ను ఎలా మరువగలను.. ప్రేమికుల రోజు శుభాకాంక్షలు..

నా ఆనందంలో నువ్వు.. నా ఊహల్లో చిత్రం నువ్వు.. నా గుండెల్లో చప్పుడు నువ్వు.. నేను అనే పదానికి అర్థం నువ్వు..

నీ ప్రేమ నాకు ఒక్క క్షణం మాత్రమే కాదు.. నా జీవితంలోని ప్రతి క్షణం నీ ప్రేమను అందిస్తావని కోరుకుంటున్నాను.. ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.

 నా మనసుకు రూపమిస్తే అది నువ్వే.. నాతో కలకాలం ఉంటావా నేస్తమా.. ప్రేమికుల శుభాకాంక్షలు..

నువ్వే నా సర్వస్వం. నువ్వే నా ప్రపంచం. నీకు నేను అంకితం. హ్యాపీ వాలెంటైన్స్ డే.

22

11

11

22Also Read: Krithi Shetty: ఉప్పెన సినిమా విడుదలై ఏడాది పూర్తి .. ఎమోషనల్‌ నోట్‌ పెట్టిన బేబమ్మ..

Gurtunda Seethakalam: వాలెంటైన్స్ డే రోజున మరో స్పెషల్ అప్డేట్.. అందమైన ప్రేమకథ గుర్తుందా శీతాకాలం ట్రైలర్ రేపే

Malli Modalaindi: కమర్షియల్ అంశాన్ని ఎంటర్‏టైన్‏గా చెప్పడమే ఇష్టం.. అందుకే ఇలా.. డైరెక్టర్ టీజీ కీర్తి కుమార్..

Actor Photo: ఈ ఫోటోలో ఉన్న చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో.. అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఎక్కువ..