AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krithi Shetty: ఉప్పెన సినిమా విడుదలై ఏడాది పూర్తి .. ఎమోషనల్‌ నోట్‌ పెట్టిన బేబమ్మ..

Krithi Shetty: ఒకే ఒక్క సినిమాతో ఓవర్‌ నైట్‌ స్టార్‌గా మారిపోయింది కృతిశెట్టి (Krithi Shetty). ఉప్పెన (Uppena) చిత్రంలో తనదైన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్లు, అభినయం అందరినీ ఆకట్టుకున్నాయి.

Krithi Shetty: ఉప్పెన సినిమా విడుదలై ఏడాది పూర్తి .. ఎమోషనల్‌ నోట్‌ పెట్టిన బేబమ్మ..
ఇదిలా ఉంటే సుస్మిత తాజాగా మ‌రో సినిమాను ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమా కోసం కృతిని తీసుకోవాల‌ని చిత్ర యూనిట్ భావిస్తున్న‌ట్లు స‌మ‌చారం.
Basha Shek
|

Updated on: Feb 13, 2022 | 9:58 PM

Share

Krithi Shetty: ఒకే ఒక్క సినిమాతో ఓవర్‌ నైట్‌ స్టార్‌గా మారిపోయింది కృతిశెట్టి (Krithi Shetty). ఉప్పెన (Uppena) చిత్రంలో తనదైన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్లు, అభినయం అందరినీ ఆకట్టుకున్నాయి. అంతకుముందు సూపర్ 30లో హృతిక్ స్టూడెంట్‌ గా ఓ చిన్న పాత్రలో కనిపించిన ఈ కన్నడ బ్యూటీ ఉప్పెన సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆక్రేజ్‌తోనే బడా హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది. నాని సరసన శ్యామ్‌ సింగరాయ్‌, నాగ చైతన్యతో నటించిన బంగార్రాజు కూడా హిట్‌ కావడంతో టాలీవుడ్‌ లక్కీ హ్యాండ్ గా మారిపోయింది కృతి. ప్రస్తుతం ఆమె రామ్‌ తో కలిసి దివారియర్‌, సుధీర్‌ బాబుతో కలిసి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నితిన్‌ తో కలిసి మాచర్ల నియోజకవర్గం అనే చిత్రాల్లో నటిస్తోంది. కాగా కృతి కెరీర్‌ను మలుపుతిప్పిన తన తొలి సినిమా ఉప్పెన విడుదలై ఏడాది పూర్తైంది. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉండే ఈ కన్నడ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌ లో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది.

నా రియల్‌ లైఫ్‌ ఈరోజే ప్రారంభమైంది..!

‘జీవితంలో మనకు రెండు పుట్టిన రోజులుంటాయి. అందులో ఒకటి… మనం పుట్టినరోజు. ఇంకొకటి.. మనం జీవితంలో ఏం చేయాలో సెలెక్ట్‌ చేసుకున్న రోజు. సరిగ్గా ఏడాది క్రితం నటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టాను. నా రియల్‌ లైఫ్‌ ఈరోజే ప్రారంభమైంది. ఇష్టపడి ఎంచుకున్న రంగంలో రాణిస్తున్నాను. కాబట్టి ఈరోజును మరో పుట్టినరోజుగా భావిస్తున్నాను. నేను నటిగా పరిచయమై ఏడాది పూర్తయింది. ప్రేక్షకులు, అభిమానులందరూ నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. ఇది నాకు మరింత ఆనందాన్నిస్తోంది. జీవితంలో నన్ను మరో అడుగు ముందుకేసేలా చేస్తుంది. ఈ ప్రయాణాన్ని గుర్తుంచుకునేలా చేసిన అభిమానులకు కృతజ్ఞతలు. ఇకపై కూడా మంచి మంచి పాత్రలతో నిత్యం మిమ్మల్ని అలరించేందుకు ప్రయత్నిస్తానని మాటిస్తున్నాను’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది కృతి.