Genelia- Riteish: భర్తను చితగ్గొట్టిన హాసినీ.. నెట్టింట్లో వైరల్ గా మారిన వీడియో..

'బొమ్మరిల్లు' సినిమాలోని 'హాసిని' పాత్రతో మన పక్కింటి అమ్మాయిలాగా పేరు తెచ్చుకుంది జెనీలియా (Genelia).

Genelia- Riteish: భర్తను చితగ్గొట్టిన హాసినీ.. నెట్టింట్లో వైరల్ గా మారిన వీడియో..
Genelia
Follow us
Basha Shek

|

Updated on: Feb 13, 2022 | 9:31 PM

‘బొమ్మరిల్లు’ సినిమాలోని ‘హాసిని’ పాత్రతో మన పక్కింటి అమ్మాయిలాగా పేరు తెచ్చుకుంది జెనీలియా (Genelia). ఆతర్వాత డీ, రెడీ, సత్యం తదితర హిట్‌ సినిమాలతోనూ టాలీవుడ్‌ ప్రేక్షకులకు మరింత చేరువైంది. బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి మంచి విజయాలు సొంతం చేసుకుంది. ఈక్రమంలోనే హీరో రితేశ్‌ దేశ్‌ముఖ్‌ (Riteish Deshmkh)తో ప్రేమలో పడి పెళ్లిపీటలెక్కింది. ఆతర్వాత ఇద్దరు పిల్లలకు తల్లిగా మారింది. తల్లైన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్‌ మీడియా (Socialmedia) లో మాత్రం చాలా యాక్టివ్‌ గా ఉంటోంది. తన ఇద్దరు పిల్లల ఫొటోలు, వీడియోలను షేర్‌ చేస్తుంటుంది. ఇక భర్త రితేష్ తో కలసి జెన్నీ చేసే వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. నెటిజన్లను కూడా ఎంతగానో అలరిస్తుంటాయి. ఈ క్రమంలో రితేష్‌ తో కలిసి ఆమె చేసిన మరో వీడియో నెటిజన్లతో నవ్వు తెప్పిస్తోంది.

ఆపరా బాబు..!

ఈ హిలేరియస్ వీడియోలో జెనీలియా, రితేష్‌లిద్దరూ ‘నాచ్ నాచ్ నాచ్’ అనే పాటకు డ్యాన్స్ చేస్తారు. అయితే సాంగ్‌ ఒకే రిథమ్‌లో వెళుతుండడంతో జెనీలియా డ్యాన్స్‌ చేయడం ఆపేస్తుంది. కానీ రితేష్‌ మాత్రం తన మానాన తాను ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్‌ కొనసాగిస్తాడు. . దీంతో జెన్నీకి చిర్రెత్తుకొస్తుంది. ఈ సమయంలో ఆమె ముఖంలోని ఎక్స్‌ప్రెషన్స్‌ చూస్తే ఎవరికైనా నవ్వు రావాల్సిందే. ఆతర్వాత ‘ఆపరా బాబూ’ అంటూ రితేష్‌ని ఇరగ్గొడుతుంది. అయితే రితేష్‌ మాత్రం ఆమెను పట్టించుకోడు. ఒక వైపు జెనీలియా కొడుతున్నా కూడా.. రితేష్ మాత్రం తన డ్యాన్స్ ఆపడు. ఇక తన కోపాన్ని ఆపుకోలేని జెనీలియా.. రితేష్‌ని మరింత చితగ్గొడుతుంది. దీంతో రితేష్‌ డ్యాన్స్‌ ఆపడంతో పాటు ముఖం చిన్నబుచ్చుకుంటాడు. అయితే ఇదంతా ఫన్ కోసమే చేసినా… వీడియో మాత్రం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ హిలేరియస్‌ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by Genelia Deshmukh (@geneliad)

Also Read:Chiranjeevi: శబరిమల అయ్యప్ప స్వామి సేవలో చిరంజీవి దంపతులు.. డోలీలో స్వామి సన్నిధికి చేరుకున్న మెగాస్టార్‌..

CM KCR: అందుకే రాజ్యాంగం మార్చాలన్నాను..అందులో తప్పేముంది? కేంద్రంపై విరుచుకుపడిన సీఎం కేసీఆర్‌..

Bitter Gourd: మీరు కాకరకాయ తినడం లేదా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు