Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mangoes: ఆ మామిడి వాసన, రుచి, అద్భుతం.. ధర కూడా అంతే రేంజ్‌లో..?

Mangoes: మామిడి పండ్లలో రారాజుగా పేరుగాంచిన హాపస్ మామిడికి (అల్ఫోన్సో మామిడి) అధిక డిమాండ్‌ ఉంటుంది. అప్పుడే ముంబై మార్కెట్‌లలోకి సరుకు రావడం మొదలైంది.

Mangoes: ఆ మామిడి వాసన, రుచి, అద్భుతం.. ధర కూడా అంతే రేంజ్‌లో..?
Alphonso Mango
Follow us
uppula Raju

|

Updated on: Feb 14, 2022 | 8:38 AM

Mangoes: మామిడి పండ్లలో రారాజుగా పేరుగాంచిన హాపస్ మామిడికి (అల్ఫోన్సో మామిడి) అధిక డిమాండ్‌ ఉంటుంది. అప్పుడే ముంబై మార్కెట్‌లలోకి సరుకు రావడం మొదలైంది. ఇప్పుడు మహారాష్ట్రలోని అన్ని మార్కెట్లకు హాపస్ మామిడి చేరుతోంది. రత్నగిరి నుంచి కొల్హాపూర్‌కు హాపస్‌ మ్యాంగో బాక్స్‌లు చేరుతున్నాయి. ఒక డజను బాక్సులను వేలంలో రూ.40,599కి విక్రయించారు. ఒక్క మామిడిపండుకు రూ.676 చెల్లించాలి. అయితే మారుతున్న వాతావరణం కారణంగా మామిడి పండ్లు మార్కెట్‌కి ఆలస్యంగా వస్తున్నాయని ఈ సీజన్‌లో మామిడి పండ్లను మొదటిసారిగా వేలం వేస్తారని వ్యాపారులు చెబుతున్నారు.

హాపస్ మామిడి రుచి, వాసన అద్భుతం

కొల్హాపూర్‌లోని హాపుస్ మామిడి కొంకణ్, కర్ణాటక నుంచి రత్నగిరి, దేవ్‌ఘర్, సింధుదుర్గ్, మాల్వాన్ తీర ప్రాంతాల నుంచి మార్కెట్లోకి వస్తుంది. కొల్హాపూర్ ప్రజలు ప్రతి సంవత్సరం మార్కెట్‌లలో హాపస్ మామిడి రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. రత్నగిరికి చెందిన ప్రసిద్ధ మామిడి పరిమాణంలో చిన్నగా ఉంటుంది కానీ వాసన, రుచి వినియోగదారులకు బాగా నచ్చుతుంది. అందువల్ల ఈ మామిడికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

మామిడిపండు ధర రూ.676

కొల్లాపూర్ వ్యవసాయోత్పత్తి మార్కెట్ కమిటీలో 5 డజన్ల బాక్సులు వచ్చాయి.. హాపస్ మామిడి మార్కెట్‌లోకి దిగిన తర్వాత బిడ్‌ ప్రారంభమైంది. 5 డజన్ల బాక్స్ 40 వేల 599 రూపాయలకు అమ్ముడైంది. ఒక్క మామిడి పండు ధర 676 రూపాయలు. ఈ సంవత్సరం తక్కువ ఉత్పత్తి కారణంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. జూన్ 15 వరకు మామిడిపండ్ల రాకపోకలు కొనసాగుతాయి.

Radhe Shyam: ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. వాలంటైన్స్‌ డే సందర్భంగా మరో అప్‌డేట్‌..?

LIC IPO: ఎల్‌ఐసీ కస్టమర్లకి గుడ్‌న్యూస్‌.. ఐపీఓ షేర్ల విషయంలో మరో కొత్త అప్‌డేట్‌..?

Sun Worship: సూర్యుడి అనుగ్రహం కోసం ఆదివారం ఉపవాసం బెస్ట్‌.. అన్ని పనులు సకాలంలో పూర్తి..?