Sun Worship: సూర్యుడి అనుగ్రహం కోసం ఆదివారం ఉపవాసం బెస్ట్.. అన్ని పనులు సకాలంలో పూర్తి..?
Sun Worship: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాలలో సూర్యుడిని రాజుగా పరిగణిస్తారు. సూర్యుడు ఒక వ్యక్తికి ఆనందం, అదృష్టం, ప్రతిష్ట, గుర్తింపుని అందిస్తాడు. జాతకంలో సూర్యుడు
Sun Worship: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాలలో సూర్యుడిని రాజుగా పరిగణిస్తారు. సూర్యుడు ఒక వ్యక్తికి ఆనందం, అదృష్టం, ప్రతిష్ట, గుర్తింపుని అందిస్తాడు. జాతకంలో సూర్యుడు శుభప్రదంగా ఉంటే ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారు. ఒకవేళ బలహీనంగా ఉంటే ఆరోగ్యంపై మాత్రమే కాదు, గౌరవం మొదలైన వాటిపై కూడా చెడు ప్రభావం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసిన విజయం సాధించకపోతే సూర్యుడిని పూజిస్తే పని జరుగుతుంది. హిందూ మతంలో ఆదివారం సూర్యుడికి అంకితం చేశారు. ఆయన అనుగ్రహం పొందడానికి ఆదివారం ఉపవాసం చేయడం గొప్ప మార్గం. కనీసం 12 ఆదివారాలు ఉపవాసం చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది.
సూర్యదేవుని అనుగ్రహం పొందడానికి ప్రతిరోజూ ఉదయించే సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. తరువాత ఆదిత్య హృదయ స్తోత్రాన్ని మూడుసార్లు పఠించడం. వీలైతే ఆదివారాల్లో ఎరుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. ఉపవాసం చేస్తున్నప్పుడు ఆహారంలో ఉప్పును ఉపయోగించకూడదు. బెల్లంతో గోధుమ రొట్టె లేదా గోధుమ గంజిని మాత్రమే తీసుకోవాలి. ఆదివారం ఉపవాసం చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం లభించి ఆరోగ్యం మెరుగవుతుంది. సూర్యుడిని పూజించడం వల్ల కంటి సంబంధిత రుగ్మతలన్నీ తొలగిపోతాయి. సనాతన సంప్రదాయంలో ఏ దేవుడి అనుగ్రహం పొందాలన్నా మంత్రాలను పఠించడం చాలా ముఖ్యం. మీ జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉండి అశుభ ఫలితాలను ఇస్తుంటే ఆదిత్య స్తోత్రాన్ని కచ్చితంగా పఠించాలి.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం జ్యోతిష్యం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని రాయడం జరిగింది.