Viral Video: దేవుడి సాంగ్ కు హీరో రేంజ్ లో డ్యాన్స్ చేసిన గున్న ఏనుగు.. నెట్టింట్లో వీడియో వైరల్..

Viral Video: సోషల్ మీడియా(Social Media) ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత వింతలు, విశేషాలతో వీడియోలు నెట్టింట్లో ప్రత్యక్షమవుతున్నాయి. వాటిల్లో జంతువులకు సంబందించిన..

Viral Video: దేవుడి సాంగ్ కు హీరో రేంజ్ లో డ్యాన్స్ చేసిన గున్న ఏనుగు.. నెట్టింట్లో వీడియో వైరల్..
Elephant
Follow us
Surya Kala

|

Updated on: Feb 13, 2022 | 1:57 PM

Viral Video: సోషల్ మీడియా(Social Media) ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత వింతలు, విశేషాలతో వీడియోలు నెట్టింట్లో ప్రత్యక్షమవుతున్నాయి. వాటిల్లో జంతువులకు సంబందించిన వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా కుక్కపిల్లలు, పిల్లులు, ఏనుగులకు సంబంధించిన వీడియోలను అయితే ఓ రేంజ్ లో షేర్ చేస్తూ.. అవి చేసే అల్లరి పనులను గురించి ప్రస్తావిస్తూ.. తమ అనుభావాలను కామెంట్స్ రూపంలో అందరితోనూ తమ ఆనందాన్ని పంచుకుంటారు. తాజా ఓ బుజ్జి గున్న ఏనుగు దేవుడి పాటకు నాట్యం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఓ గున్న ఏనుగు.. దేవుడి పాటకు హీరో రేంజ్ లో స్టెప్స్ వేస్తుంది. అయితే ఆ ఏనుగు పిల్ల రోడ్డుకి అడ్డంగా నిలుచుని ఎంతో వయ్యారంగా డ్యాన్స్ చేస్తూంటే.. పక్కన ఉన్న మావటి.. తన చేతిలోని కర్రతో గున్న ఏనుగుకి సిగ్నల్ ఇచ్చాడు. అంతే ఎదో అర్ధమయినట్లు… ఆ గున్న ఏనుగులు రోడ్డుకి నిలువుగా తిరిగి.. పాటకి అనుగుణంగా కాళ్ళను లయబద్దంగా కదుపుతూ.. మనిషి చేసినట్లు ఎంతో అందంగా డ్యాన్స్ చేసింది. ఈ గున్న ఏనుగు ఎప్పుడు ఏ సందర్భంలో డ్యాన్స్ చేసిందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. మీరు కూడా ఆ ఏనుగు డ్యాన్స్ పై ఓ లుక్ వేయండి. వావ్ అంటూ ప్రశంసల వర్షం కురిపించండి.

Read Also :

నేడు శ్రీరామనగరానికి రాష్ట్రపతి.. సమతామూర్తిని సందర్శించనున్న కోవింద్