AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC IPO: ఎల్‌ఐసీ కస్టమర్లకి గుడ్‌న్యూస్‌.. ఐపీఓ షేర్ల విషయంలో మరో కొత్త అప్‌డేట్‌..?

LIC IPO: ఎల్‌ఐసీ కస్టమర్లకి ఇది శుభవార్తనే చెప్పాలి. ఎల్‌ఐసీ ఐపీవో విషయంలో మరో ముందడుగు పడింది. కంపెనీ ఐపీవో కోసం సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. మార్చిలో

LIC IPO: ఎల్‌ఐసీ కస్టమర్లకి గుడ్‌న్యూస్‌.. ఐపీఓ షేర్ల విషయంలో మరో కొత్త అప్‌డేట్‌..?
Lic5
uppula Raju
|

Updated on: Feb 14, 2022 | 7:09 AM

Share

LIC IPO: ఎల్‌ఐసీ కస్టమర్లకి ఇది శుభవార్తనే చెప్పాలి. ఎల్‌ఐసీ ఐపీవో విషయంలో మరో ముందడుగు పడింది. కంపెనీ ఐపీవో కోసం సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. మార్చిలో ఐపీఓ మార్కెట్‌లోకి రానుంది. SEBIకి దాఖలు చేసిన ముసాయిదా రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) ప్రకారం ఎల్‌ఐసీ 31 కోట్లకు పైగా ఈక్విటీ షేర్లను ప్రభుత్వం విక్రయించనుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ని మార్చి నాటికి స్టాక్ ఎక్స్ఛేంజీలలో జాబితా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.

ఐపీవోలో10 శాతం పాలసీదారులకు రిజర్వ్ చేస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంలో రూ.78,000 కోట్ల లోటు ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీ ఐపీవో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎయిరిండియా ప్రైవేటీకరణ, ఇతర ప్రభుత్వరంగ సంస్థలలో వాటాల విక్రయం ద్వారా ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు రూ.12,000 కోట్లు సమీకరించింది. 2020లో LIC దేశీయ మార్కెట్ వాటా 64.1 శాతానికి పైగా ఉంది. జీవిత బీమా ప్రీమియంల విషయంలో LIC ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కంపెనీ. నివేదిక ప్రకారం ఎల్‌ఐసీ మార్కెట్ వాటా 2000 సంవత్సరం ముందు100 శాతం ఉంది. ఇది క్రమంగా 2016 నాటికి 71.8 శాతానికి తగ్గింది. 2020లో LIC మార్కెట్ వాటా 64.1 శాతానికి తగ్గింది.

DRHP అంటే ఏమిటి

సెబీకి దాఖలు చేసిన డ్రాఫ్ట్ పేపర్‌ను డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) అంటారు. ఇందులో కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఈ డ్రాఫ్ట్‌లో కంపెనీకి చెందిన షేర్లు ఎన్ని విక్రయిస్తారో కంపెనీ తెలియజేస్తుంది. DRHP మొదట సెబీలో దాఖలు చేశారు. కంపెనీ తన వాటాను విక్రయించాలనుకుంటున్నట్లు చెప్పింది. సెబీ ఈ పత్రాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని IPOకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఎల్‌ఐసీ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసి ఒక అడుగు ముందుకు వేసింది. ఈ IPO ద్వారా ప్రభుత్వం ఎల్‌ఐసీ 316,294,885 ఈక్విటీ షేర్లను విక్రయిస్తుంది. ఒక్కో షేరు ముఖ విలువ రూ.10 ఉంటుంది. LIC IPO ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అంటే మార్చి 31 నాటికి మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. వారం రోజుల క్రితమే ఎల్‌ఐసీ ఎంబెడెడ్ విలువ రూ.5 లక్షల కోట్లుగా నిర్ణయించారు. భారత ప్రభుత్వం వాటా విక్రయం తిరిగి పొందుతుంది.

UP Assembly Election 2022 Voting Live: ఆ మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం.. సమరంలో హేమా హేమీలు..

DC, IPL 2022 Auction: ధావన్, వార్నర్‌తో సహా ఢిల్లీ సైన్యంలో చేరిన 24 మంది ఆటగాళ్లు.. డీసీ పూర్తి జాబితా ఇదే..

Kim Jong Un: మరోసారి వార్తల్లో నిలిచిన ఉత్తర కొరియా నియంత.. బ్లాస్టింగ్‌తో హౌసింగ్‌ ప్రాజెక్టుకు భూమిపూజ చేసిన కిమ్‌..