AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kim Jong Un: మరోసారి వార్తల్లో నిలిచిన ఉత్తర కొరియా నియంత.. బ్లాస్టింగ్‌తో హౌసింగ్‌ ప్రాజెక్టుకు భూమిపూజ చేసిన కిమ్‌..

North Korea: ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్ ఉన్ ( Kim Jong Un) స్టైలే వేరు. ఓవైపు దేశం ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతుంటే కొత్త క్షిపణి పరీక్ష చేసి అమెరికాతో పాటు జపాన్‌, దక్షిణకొరియా (South Korea) దేశాలకు సవాల్‌ విసురుతుంటాడు.

Kim Jong Un: మరోసారి వార్తల్లో నిలిచిన ఉత్తర కొరియా నియంత.. బ్లాస్టింగ్‌తో హౌసింగ్‌ ప్రాజెక్టుకు భూమిపూజ చేసిన కిమ్‌..
Kim Jong Un
Basha Shek
|

Updated on: Feb 14, 2022 | 6:50 AM

Share

North Korea: ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్ ఉన్ ( Kim Jong Un) స్టైలే వేరు. ఓవైపు దేశం ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతుంటే కొత్త క్షిపణి పరీక్ష చేసి అమెరికాతో పాటు జపాన్‌, దక్షిణకొరియా (South Korea) దేశాలకు సవాల్‌ విసురుతుంటాడు. అంతేకాదు.. లోకమంతా ఒక తీరుంటే తామెప్పుడూ తేడా అని ఎప్పటికప్పుడు చాటుకునేందుకు ఏమాత్రం మొహమాట పడడు ఉత్తర కొరియా (North Korea) నియంత కిమ్ జోంగ్‌. ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు రుజువైంది. కొద్ది రోజుల క్రితం భార్య రిసోల్‌ జుతో థియేటర్‌ లో కనిపించి ఆశ్చర్యపరిచిన కిమ్‌జోంగ్‌ ఉన్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు.

శిలాఫలకం బదులు..

దేశాధినేతల్లో కిమ్‌జోంగ్‌ ఉన్‌ది ప్రత్యేక స్థానం. ఆయన ఏం చేసినా అది ఉత్తర కొరియా ప్రజల కోసమే అని నమ్మించే నేర్పరి ఆయన. ఆఖరికి క్షిపణి ప్రయోగాలు చేసినా కూడా, అది నార్త్‌ కొరియన్ల కోసమే అంటుంటారు కిమ్‌. తాజాగా మరో కార్యక్రమం ప్రారంభించారు కిమ్‌. నార్త్ కొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లో ఓ కొత్త భారీ నిర్మాణ ప్రాజెక్టుకు భూమి పూజ చేశారాయన. హౌసింగ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మామూలుగా భూమిపూజ కార్యక్రమం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కొబ్బరికాయలు కొట్టడం, పునాది రాయి వేయడం వంటివి చేస్తారు. కానీ కిమ్‌ రూటే సెపరేట్‌ కదా. అందుకే ఆ కార్యక్రమాన్ని కూడా తనకిష్టమైన బ్లాస్టింగ్‌ సిస్టంలో ప్రారంభించారు కిమ్. ప్రాజెక్ట్‌కు గుర్తుగా ఏ ప్రభుత్వం అయినా శిలాఫలకం వేస్తుంది. కానీ కిమ్‌ అందుకు భిన్నంగా ఈ ప్రాజెక్ట్‌కు గుర్తుగా భారీ పేలుళ్లు నిర్వహించింది కిమ్‌ ప్రభుత్వం. కిమ్ ప్రసంగం తర్వాత ఈ పేలుళ్లు జరిగాయి.

వేలాదిమంది కార్మికుల మధ్య పేలుళ్లు..

ఉత్తర కొరియా రాజధాని శివారు ప్రాంతంలో మరో 10 వేల ఇళ్లను నిర్మించడమే లక్ష్యంగా ఈ హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ చేపట్టారు. 2025 నాటికి ప్యాంగ్యాంగ్‌లో 50 వేల అపార్ట్‌మెంట్‌లను లేదా ప్రతి సంవత్సరం 10 వేల యూనిట్లను నిర్మించడమే తన లక్ష్యమని ప్రకటించారు కిమ్. ప్రస్తుత పరిస్థితులు గతంలో కంటే చాలా కష్టంగా ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్ట్‌ చేపడుతున్నామని చెప్పారాయన. నిర్మాణ రంగంలో నార్త్‌ కొరియా పనితనం చూపించాలని, ప్రపంచంలోనే గొప్ప నగరంగా ప్యాంగ్యాంగ్‌ తయారుకావాలని ఆకాంక్షించారు కిమ్‌జోంగ్ ఉన్. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, కిమ్ ప్రసంగాన్ని వినడానికి వేలాది మంది నిర్మాణ కార్మికులు ఈ కార్యక్రమానికి వచ్చారు. అయితే, ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Also Read:Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త.. రేపటి నుంచే ఆఫ్‌లైన్‌ సర్వదర్శనం టోకెన్ల జారీ.. పూర్తి వివరాలివే..

PSLV-C52: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ52 రాకెట్.. ఇస్రో ఈ ఏడాది తొలి ప్రయోగం సక్సెస్..

Horoscope Today: ఈ వ్యక్తులు ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు.. నేడు ఏ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..