తన తండ్రి జన్మదిన వేడుకలకు పువ్వులు పూయించలేదని ఇద్దరు తోటమాలులకు జైలు శిక్ష విధించిన ఆ దేశ అధ్యక్షుడు

North Korea: నియంత హిట్లర్ గురించి నేటి జనరేషన్ పుస్తకాల ద్వారా తెలుసుకుంటున్నారు.. అయితే నేటి జనరేషన్ కు నియంత అంటే ఏమిటి.. అతని పాలన ఎలా ఉంటుందో ఉత్తరకొరియా ను పాలిస్తున్న కిం జాంగ్ ఉన్( Kim Jong-un)..

తన తండ్రి జన్మదిన వేడుకలకు పువ్వులు పూయించలేదని ఇద్దరు తోటమాలులకు జైలు శిక్ష విధించిన ఆ దేశ అధ్యక్షుడు
North Korea
Follow us
Surya Kala

|

Updated on: Feb 13, 2022 | 7:46 PM

North Korea: నియంత హిట్లర్ గురించి నేటి జనరేషన్ పుస్తకాల ద్వారా తెలుసుకుంటున్నారు.. అయితే నేటి జనరేషన్ కు నియంత అంటే ఏమిటి.. అతని పాలన ఎలా ఉంటుందో ఉత్తరకొరియా ను పాలిస్తున్న కిం జాంగ్ ఉన్( Kim Jong-un) తన చేతలతో చూపిస్తూనే ఉన్నాడు. ఆ దేశంలో నవ్వినా దగ్గినా తుమ్మినా అది ప్రపంచానికి పెద్ద వార్త.. ఎందుకంటే అధ్యక్షుడు కిమ్ తీసుకునే నిర్ణయాలు అలా ఉంటాయి కనుక. తన దేశంలోని ప్రజలు, అధికారులు ఎవరినా సరే చిన్న పొరపాటు చేసినా డానికి పెద్ద శిక్షలను విధిస్తూ.. సంచలనం సృష్టిస్తుంటాడు. తాజాగా మొక్కలకు పువ్వులు పూయలేదని తోటమాలికి విధించిన శిక్షతో మళ్ళీ వార్తల్లో నిలిచాడు కిమ్ జోంగ్ ఉన్. వివరాల్లోకి వెళ్తే..

కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ జన్మదినం సందర్భంగా అలంకరణ కోసం ఉపయోగించే ‘కిమ్‌జోంగిలియా’ బిగోనియా పువ్వులను వికసించేలా చేయడంలో విఫలమయ్యారంటూ.. ఉత్తర కొరియా తోటమాలీలను అరెస్ట్ చేయించాడు. అంతేకాదు వీరిద్దరికి ఆరునెలలు శిక్ష విధించి.. లేబర్ క్యాంప్(జైలు)కి తరలించాడు కిమ్. ఉత్తర కొరియా ఫిబ్రవరి 16 న కిమ్ జోంగ్-ఇల్ పుట్టినరోజును జరుపుకుంటుంది, దీనిని ‘డే ఆఫ్ షైనింగ్ స్టార్’ అని కూడా పిలుస్తారు. సాంప్రదాయకంగా, ఉత్తర కొరియాలోని నగర వీధులు 2011లో 69 ఏళ్ల వయసులో మరణించిన దివంగత నియంత పుట్టినరోజుకు ముందు ఎర్రటి పువ్వులతో కప్పబడి ఉంటాయి. దివంగత అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఇల్ జన్మదినం సందర్భంగా..రహదారి పొడువునా.. ఆయన సమాధి ప్రాంతం వరకూ ఈ ఎర్రటి ‘కిమ్‌జోంగిలియా పువ్వులు పూచేలా ప్రతి ఏడాది మొక్కలను ఏర్పాటు చేస్తారు.

‘కిమ్‌జోంగిలియా’ పువ్వులు సమశీతోష్ణస్థితి వాతావరణంలో మాత్రమే పెరుగుతాయి. అయితే అయితే ఈ ఏడాది ఈ పువ్వుల మొక్కలున్న గ్రీన్‌హౌస్‌లలో సరైన ఉష్ణోగ్రత, తేమను ఏర్పాటు చేయడానికి తోటమాలిలు చాలా కష్టపడ్డారని డైలీ ఎన్‌కె న్యూస్ నివేదించింది. కిమ్ జోంగ్-ఇల్ పుట్టినరోజు కోసం సకాలంలో పువ్వులు సిద్ధం చేయడంలో విఫలమైనందుకు ఇద్దరు తోటమాలీలు మొక్కలను నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ.. జైలు శిక్షను విధించారని ఆ మీడియా సంస్థ తెలిపింది. సంసు కౌంటీలో ‘కిమ్‌జోంగిలియా’ను పెంచుతున్న వ్యవసాయ క్షేత్రంలోని మేనేజర్‌ని అరెస్టు చేసి, తన మొక్కలను జాగ్రత్తగా చూసుకోనందుకు ఆరు నెలల శిక్ష విధించబడిందని సియోల్ ఆధారిత వార్తా సంస్థ నివేదించింది. ఉత్తరకొరియా, చైనాలో విరివిగా పూచే ఈ పూలు దక్షిణాసియాలో కనిపించే మందారం జాతికి చెందినవిగా పేర్కొంటారు.

Also Read:

 కచా బాదం పాటను ఇలా ట్రై చేయండి.. నెటిజన్లకు ఛాలెంజ్ విసిరిన ఊ అంటావా సాంగ్ కొరియోగ్రాఫర్..