Uyghur Muslims: చైనాకు మద్దతుగా ఇమ్రాన్ వ్యాఖ్యలు.. పాక్ ప్రధానికి వ్యతిరేకంగా టర్కీలో ఉయ్ఘర్ వలసవాదులు నిరసన..
Uyghur Muslims: టర్కీ(Turkey)లోని ఇస్తాంబుల్‌లో పాకిస్థాన్(Pakistan) ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) కు వ్యతిరేకంగా ఉయ్ఘర్ వలసవాదులు నిరసన చేపట్టారు . బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ 2022 ప్రారంభ వేడుక..
Uyghur Muslims: టర్కీ(Turkey)లోని ఇస్తాంబుల్‌లో పాకిస్థాన్(Pakistan) ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) కు వ్యతిరేకంగా ఉయ్ఘర్ వలసవాదులు నిరసన చేపట్టారు . బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ 2022 ప్రారంభ వేడుక నుండి పాకిస్తాన్ కు తిరిగి వచ్చిన తర్వాత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనాపై చేసిన ప్రకటనపై ఉయ్ఘర్ లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇస్తాంబుల్‌లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం వద్ద ఉయ్ఘర్ వలసదారులు నిరసన వ్యక్తం చేస్తూ ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జిన్‌జియాంగ్‌లోని ఉయ్ఘర్ ముస్లింలపై చైనా అణచివేత విషయంపై స్పందిస్తూ.. చైనాకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు నివేదికల ద్వార తెలుస్తోంది. ఇమ్రాన్ ఖాన్ . చైనాకు మద్దతు పలకడాన్ని ఉయ్ఘర్ ముస్లింలు నిరసిస్తూ.. ఇమ్రాన్ ఖాన్ అబద్ధాలు చెబుతున్నారని.. ఇది తమను పాకిస్తాన్ నుండి బహిష్కరించడమేనని ఉయ్ఘర్లు చెప్పారు. 130 మంది నిరసనకారుల బస్సులు ఇస్తాంబుల్‌లోని పాకిస్థాన్ కాన్సులేట్‌కు చేరుకున్నాయి. అయితే నిరసన తెలియజేయడానికి పాక్ దౌత్యకార్యాలయం ప్రధాన ద్వారం వద్ద నిలబడేందుకు కేవలం పది మందికి మాత్రమే అనుమతించారు. నిరసన కారులు భద్రతా అధికారులకు మెమోరాండం అందజేయగా.. వారు దానిని స్వీకరించమని నిరాకరించారు.
మెమోరాండాన్ని ప్రధాన ద్వారంపై అతికించిన నిరసన కారులు: మెమోరాండం ఉన్న కవరును కాన్సులేట్ ప్రధాన ద్వారం వద్ద కూడా అతికించారు. ప్రజల రద్దీని చూసి పాకిస్థాన్ ఎంబసీ సీనియర్ అధికారులు బయటకు వచ్చారు. నిరసన కారులతో వాగ్వాదానికి దిగారు. పాకిస్తాన్ రాయబార కార్యాలయం వద్ద కాదు.. చైనా రాయబార కార్యాలయం ముందు నిరసన తెలియజేయాలని ఆయన నిరసనకారులను కోరారు. చివరకు 25 మందిని మాత్రమే నిరసనకు అనుమతించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించబోమని ఉయ్ఘర్ వలసవాదులు హామీ ఇచ్చారు. అయితే 25 మందితో మొదలైన నిరసన 75 మందిగా మారిపోయింది.
భద్రతా అధికారులతో ఘర్షణ ఉయ్ఘర్ వలసవాదులు నిరసన దాదాపు అరగంట పాటు సాగింది. దీంతో టర్కీ పోలీసులు నిరసన కారులను వెనక్కి పంపించారు. ప్రదర్శన సందర్భంగా భద్రతా అధికారులకు, ఆందోళనకారులకు మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది. ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఉయ్ఘర్‌లను ఎంబసీ సీనియర్ అధికారి అడ్డుకోవడంతో చిన్నపాటి ఘర్షణ జరిగింది. తనను తాను ముస్లింల మెస్సీయగా చెప్పుకునే ఇమ్రాన్ ఖాన్ ఉయ్ఘర్ ముస్లింల మారణహోమం విషయంలో ఎప్పుడూ మౌనంగానే ఉన్నారని ఉయ్ఘర్ వలసవాదులు వ్యాఖ్యానించారు. తమ విషయంలో చైనాకు మద్దతు ఇస్తున్నారని ఉయ్ఘర్ వలసవాదులు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: