Telangana: మాతృభూమిపై మమకారం చాటుకుంటోన్న ఎన్నారైలు.. మన ఊరు- మనబడికి విరాళాల వెల్లువ..

పుట్టి పెరిగిన మాతృభూమి రుణం తీర్చుకునేందుకు ఎన్నారైలు (NRI) ముందుకొస్తున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులుగా మార్చిన పాఠశాలలకు తమ వంతు సహాయం చేస్తున్నారు.

Telangana: మాతృభూమిపై మమకారం చాటుకుంటోన్న ఎన్నారైలు.. మన ఊరు- మనబడికి విరాళాల వెల్లువ..
Mana Ooru Manabadi
Follow us
Basha Shek

|

Updated on: Feb 13, 2022 | 2:58 PM

పుట్టి పెరిగిన మాతృభూమి రుణం తీర్చుకునేందుకు ఎన్నారైలు (NRI) ముందుకొస్తున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులుగా మార్చిన పాఠశాలలకు తమ వంతు సహాయం చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మనఊరు- మనబడి (Mana Ooru Manabadi) కార్యక్రమానికి విరాళాలు అందజేస్తున్నారు. ఆశ్చర్యకరంగా ఏపీకి చెందిన ప్రవాస భారతీయులు కూడా ఈ కార్యక్రమానికి విరాళాలు ప్రకటించి హైదరాబాద్‌తో పాటు తెలంగాణపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. శనివారం మన ఊరు- మన బడి’ కార్యక్రమంపై మంత్రులు కేటీఆర్‌ (KTR), సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) ఎన్నారై లతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ విషయంలో చేయూత నందించిన ఎన్నారైలకు తెలంగాణ విద్యాశాఖ సంపూర్ణ సహకారం అందిస్తుందని మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.

విశేష స్పందన.. కాగా మంత్రి కేటీఆర్‌ సిద్ధిపేట జిల్లా చింతమడక గ్రామంలోని తను చదివిన పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా కేటీఆర్‌ ఇచ్చిన పిలుపుతో మరికొంతమంది దాతలు, ఎన్నారైలు ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌లో చదువుకుని టీఆర్ఎస్‌ ఎన్నారై కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తోన్న మహేశ్‌ బిగాల మన ఊరు-మనబడి కార్యక్రమానికి రూ.కోటి విరాళం ప్రకటించారు. అదేవిధంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ అధ్యక్షుడు, ఎన్నారై ప్రతినిధి జయశేఖర్‌ తాళ్లూరి ఈ పథకానికి తనవంతుగా రూ.25 లక్షల సాయం చేస్తానన్నారు. ఏపీకి చెందిన కొంతమంది ప్రవాస భారతీయులు కూడా ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. తమ వంతు విరాళాలు అందిస్తామని ముందుకొచ్చారు. ఈ క్రమంలో విజయవాడకు చెందిన ప్రవాస భారతీయుడు నిమ్మగడ్డ కృష్ణకాంత్‌ మన ఊరు-మన బడి పథకానికి రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ కృష్ణకాంత్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

Also Read:Ram Nath Kovind: హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. స్వాగతం పలికిన గవర్నర్, సీఎం..

TS Eamcet 2022: తెలంగాణ ఎంసెట్ 2022 జూన్‌-జూలైలో.. త్వరలో షెడ్యూల్‌ విడుదల!

Uyghur Muslims: చైనాకు మద్దతుగా ఇమ్రాన్ వ్యాఖ్యలు.. పాక్ ప్రధానికి వ్యతిరేకంగా టర్కీలో ఉయ్ఘర్ వలసవాదులు నిరసన..