Telangana: తెలంగాణ చిన్నారి సంచలనం.. అతి చిన్న వయస్సులోనే నోబెల్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు..

Telangana: తెలంగాణకు చెందిన ఓ చిన్నారి సంచలనం సృష్టించింది. అతి పిన్న వయస్సులోనే నోవెల్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుని అందరిచే ప్రశంసలు అందుకుంటోంది.

Telangana: తెలంగాణ చిన్నారి సంచలనం.. అతి చిన్న వయస్సులోనే నోబెల్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు..
Follow us

|

Updated on: Feb 13, 2022 | 1:59 PM

Telangana: తెలంగాణకు చెందిన ఓ చిన్నారి సంచలనం సృష్టించింది. అతి పిన్న వయస్సులోనే నోవెల్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుని అందరిచే ప్రశంసలు అందుకుంటోంది. ప్రపంచంలోనే అతి చిన్న వయస్సు పారాగ్లైడర్‌గా నోబెల్ వరల్డ్ రికార్డ్స్‌లో రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. జిల్లెల్ల అన్నిక రెడ్డి (11Yrs, 7Months) ని తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, టూరిజం, కల్చర్, క్రీడలు, యువజన సర్వీసులు, పురవస్తు శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారు అభినందించారు.

వివరాల్లోకెళితే.. జిల్లెల్ల అన్నిక రెడ్డి హైదరాబాద్ ఉప్పల్‌లోని మెరిడీయన్ స్కూల్‌లో 6వ తరగతి చదువుతోంది. ఫిబ్రవరి 4, 2022 వ తేదీన మహారాష్ట్రలోని కాంషేట్‌లో నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పారాగ్లైడర్ పోటీలలో పాల్గొంది. అయితే, ఈ పోటీల్లో పాల్గొన్న ప్రపంచంలోనే అతి పిన్న వయస్సు (11సం. 7నెలలు) గల పారాగ్లైడర్ గా రికార్డును సొంతం చేసుకుంది అన్నిక. కాగా, ఈ కార్యక్రమంలో అన్నిక రెడ్డి తల్లిదండ్రులు విజయభాస్కర్ రెడ్డి, ప్రత్యూష రెడ్డి, జూపల్లి భాస్కర్ రావు, రాములు, లక్ష్మణ్, డా. రామ్మోహన్, కిషోర్ తదితరులు ఉన్నారు.

Also read:

Viral Video: దేవుడి సాంగ్ కు హీరో రేంజ్ లో డ్యాన్స్ చేసిన గున్న ఏనుగు.. నెట్టింట్లో వీడియో వైరల్..

Covid 19 Vaccine: కరోనాకు వ్యతిరేకంగా కొత్త ఆయుధం.. అమృత యూనివర్సిటీ అధ్యయనంలో వెలుగులోకి సంచలనాలు!

Telangana Politics: నా రూటే సపరేట్ అంటున్న కోమటిరెడ్డి.. పార్టీలో చర్చనీయాంశంగా మారిన వెంకట్ రెడ్డి తీరు..