Potato Milk: ఏవండోయ్‌.. మార్కెట్‌లోకి ‘ఆలూ పాలు’.. ఎగబడుతున్న జనాలు

‘ఆలూ మిల్క్‌’. అవును..! ఇప్పుడు ఆలూ పాలు అందుబాటులోకి వచ్చాయి. స్వీడ‌న్‌కు చెందిన డ‌గ్ (DUG)కంపెనీ వీటిని బ్రిటన్‌లో ప్రవేశపెట్టింది.

Potato Milk: ఏవండోయ్‌.. మార్కెట్‌లోకి ‘ఆలూ పాలు’.. ఎగబడుతున్న జనాలు
Dug Potato Milk
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 13, 2022 | 1:15 PM

మనకు తెలిసిన పాల గురించి చెప్పమంటే..ఆవు పాలు, గేదె పాలు, మేక పాలు, సోయా మిల్క్‌, ఆ మిల్కూ.. ఈ మిల్కూ అంటూ టకా టకా చెప్పేస్తాం… కానీ అవీ కాకుండా ఇంకొన్ని చెప్పడంటే… గాడిద పాలు కూడా ఇటీవల ప్రాచూర్యం పొందింది.  తాజాగా ఈ లిస్ట్‌లో మరో పేరు చేరింది. అదే.. ‘ఆలూ మిల్క్‌’. అవును..! ఇప్పుడు ఆలూ పాలు అందుబాటులోకి వచ్చాయి. స్వీడ‌న్‌కు చెందిన డ‌గ్ (DUG)కంపెనీ వీటిని బ్రిటన్‌లో ప్రవేశపెట్టింది. వీటిలో పోషకాలు ఎక్కువే.. ధరలు కూడా అక్కడి ప్రజలకు అందుబాటులో ఉంటాయట. ఈ పాల ద్వారా వివిధ రకాల విట‌మిన్స్‌ శరీరానికి అందటంతో పాటు రుచిక‌రంగా ఉంటాయట. సాధార‌ణంగా ఆవులు, గేదెలు తదితర వాటినుంచి నుంచి ల‌భించే పాలల్లో లాక్టోజ్ ఉంటుంది. అయితే ఈ బంగాళాదుంప పాలలో లాక్టోజ్ ఉండదట. అందుకే శాకాహారులు వీటిని విపరీతంగా ఇష్టపడుతున్నారట. ఇక ఈ పాల ధర లీట‌ర్ 170 రూపాయలు పలుకుతోంది. దాంతో ఈ ఆలూ పాలకి మంచి గీరాకి అవుతోంది. సోయా పాల‌లో ల‌భించే ప్రోటీన్ల క‌న్నా ఇందులో నాలుగు రెట్లు అధికంగా ఉంటాయట.

జంతువుల నుంచి సేకరించే పాలలాగానే ఆలూ పాలు కూడా చిక్కగా, రుచికరంగా ఉంటాయంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం బ్రిటన్‌లో అందుబాటులో ఉన్న ఈ పాలు.. త్వరలోనే ఐరోపాతో పాటు, అమెరికా, చైనాలోనూ ప్రారంభించాలని డగ్‌ కంపెనీ యోచిస్తోంది. ఈ పాలతో మనం కాఫీ లాగానే కాపిచీనో కూడా తయారు చేసుకోవచ్చని ఆహార ప్రియులు చెబుతున్నారు. వివిధ పోషకాలతో కూడిన ఆలూ పాలను కొనేందుకు ప్రస్తుతం యూకేవాసులు పోటీపడుతున్నారట. ఇది వెగాన్‌ ఫ్రెండ్లీ కావడంతో వీగన్లు కూడా ఈ ఆలూ పాలు కొంటున్నారట.

Potato Milk

Also Read: ఇంజినీరింగ్ కంప్లీట్ చేశాడు.. ఎందులో స్పెషలిస్టో తెలిస్తే.. బుర్ర బ్లాంక్ అవ్వడం ఖాయం

‘స్కిన్​షో తప్ప ఏముంది..’ ‘గెహ్రాహియా’ చెత్త సినిమా అంటూ కంగనా సంచలన కామెంట్స్

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!