Viral Video: కచా బాదం పాటను ఇలా ట్రై చేయండి.. నెటిజన్లకు ఛాలెంజ్ విసిరిన ఊ అంటావా సాంగ్ కొరియోగ్రాఫర్..
సోషల్ మీడియాలో ప్రతిదీ ట్రెండ్ అవుతుంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్‌కు జనాలకు ఆసక్తి చూపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో
సోషల్ మీడియాలో ప్రతిదీ ట్రెండ్ అవుతుంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్‌కు జనాలకు ఆసక్తి చూపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పుష్ప సాంగ్స్.. సామి సామి, ఊ అంటావా మావ అనే పాటలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ పాటలకు నెటిజన్స్ తమదైన స్టైల్లో స్టెప్పులేశారు. ఇక తాజాగా సోషల్ మీడియాలో కచా బాదం సాంగ్ తెగ వైరల్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ విన్నా.. చూసిన ఈ పాటకు నెటిజన్స్ స్టెప్పులేస్తున్నారు. సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం కచా బాదం పాటగా అదిరిపోయేలా డాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కచా బాదం పాటకు కాలు కదిపారు.
కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ ఇటీవల అల్లు అర్జున్.. రష్మిక మందన్న నటించిన పుష్ప సినిమాలోని పాటలకు కొరియోగ్రఫి చేశారు.. అందులో సమంత నటించిన స్పెషల్ సాంగ్ ఊ అంటావా మావ.. ఊహు అంటావ పాటకు గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫి చేశారు. ఈ పాట నెట్టింట్లో తెగ ఫేమస్ అయ్యింది. ఇప్పుడు గణేష్ మాస్టర్ సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయిన కచా బాదం పాటకు డాన్స్ చేసి తనలాగే స్టెప్పులేయాలంటూ ఫాలోవర్లకు ఛాలెంజ్ విసిరాడు. ఈ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మీరు ఓ లుక్కెయ్యండి..
View this post on Instagram
Also Read: Valentine’s Day: రాశిని బట్టి డ్రస్ కలర్.. ప్రేమికుల రోజున ధరిస్తే.. లవ్ సక్సెస్ అయినట్టే..
Sarkaru Vaari Paata: కళావతి ఒరిజినల్ వచ్చేసింది.. అదిరిపోయిన మహేష్ కీర్తి కెమిస్ట్రీ..