Viral Video: మనుషులు సిగ్గుపడేలా.. కష్టాల్లో ఉన్న మరో ప్రాణిని రక్షించింది.. వీడియో వైరల్
ప్రస్తుతం ప్రపంచం పూర్తిగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది. టెక్నాలజీ పరంగా దూసుకుపోతున్న మనం.. మానవత్వం చాటడంలో మాత్రం
ప్రస్తుతం ప్రపంచం పూర్తిగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది. టెక్నాలజీ పరంగా దూసుకుపోతున్న మనం.. మానవత్వం చాటడంలో మాత్రం వెనకబడిపోయాము. సగటు ప్రాణి ప్రాణం కోసం కొట్టుకుంటుంటే… పక్కనే ఉండి వీడియోస్.. ఫోటోస్ తీస్తూ ఎంజాయ్ చేస్తాం.. కానీ వారికి సాయం చేసి ప్రాణాలను నిలబెట్టరు. ప్రస్తుతం చాలావరకు ఎక్కడ చూసిన ఇదే పరిస్థితి కనిపిస్తోంది. స్మార్ట్ ఫోన్ మాయలో పడి మానవత్వాన్ని మర్చిపోతున్నాం. కానీ జంతువులు అలా కాదు.. ఆకలితో ఇతర జంతువులను క్రూరంగా వేటాడే పులులు, సింహాలు సైతం ఒకానొక సమయంలో మరో జంతువులకు సాయంగా ఉంటాయి. మరికొన్ని జంతువులు.. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మిగతావాటిని రక్షిస్తాయి. అలాంటి మనసుకు హత్తుకునే వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదెంటో తెలుసుకుందామా.
ఆ వీడియోలో ఓ జూపార్కులో ఎలుగుబంటి నడుస్తూ వెళ్తున్న సమయంలో పక్కనే ఉన్న నీటిలో ఓ కాకి పడిపోయి ప్రాణాల కోసం కొట్టుకుంటుంది. అది చూసిన ఎలుగు బంటి వెంటనే కాకి కొట్టుకుంటున్న ప్రదేశానికి వెళ్లి.. ఒడ్డున నిలబడి తన కాళ్లతో కాకిని పట్టుకుంది. అనంతరం.. కాకిని తన నోటితో పట్టుకుని ఒడ్డున పడేసి తన దారి తను వెళ్లిపోయింది. ఇక బయటకు వచ్చిన కాకి.. కాసేపు అలాగే కొట్టుకుని.. ఆ తర్వాత లేచి నిలబడింది. ఈ సంఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది తెగ వైరల్ అవుతుంది. తాజాగా ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్వట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ఎలుగుబంటి మునిగిపోతున్న కాకిని రక్షించింది. ఈ రోజుల్లో మనుషుల కంటే మాట్లాడలేని జీవులలో ఎక్కువగా మానవత్వం కనిపిస్తుంది. కదా.. ? కేవలం 46 సెకన్ల ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలురకాలుగా స్పందిస్తుంటారు.
भालू ने डूबते कव्वे को बचाया…
आजकल इंसानों से ज्यादा #इंसानियत बेजुबान जीवों में देखने को मिल रही है ना?#HelpChain.#humanity #KindnessMatters pic.twitter.com/UocDGIfUHL
— Dipanshu Kabra (@ipskabra) February 12, 2022
Also Read: Valentine’s Day: రాశిని బట్టి డ్రస్ కలర్.. ప్రేమికుల రోజున ధరిస్తే.. లవ్ సక్సెస్ అయినట్టే..
Sarkaru Vaari Paata: కళావతి ఒరిజినల్ వచ్చేసింది.. అదిరిపోయిన మహేష్ కీర్తి కెమిస్ట్రీ..