Crime News: చదువుకునేందుకు బ్రిటన్ వెళ్లాడు.. పాడు పని చేయాలనుకున్నాడు.. చివరికి..

Kerala student arrest in UK: బ్రిటన్‌లో చదువుతున్న భారత సంతతికి చెందిన ఓ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. పిల్లల వేధింపులకు సంబంధించిన కేసులో శనివారం కేరళకు చెందిన విద్యార్థిని అరెస్టు చేసినట్లు

Crime News: చదువుకునేందుకు బ్రిటన్ వెళ్లాడు.. పాడు పని చేయాలనుకున్నాడు.. చివరికి..
Arrest
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 14, 2022 | 9:27 AM

Kerala student arrest in UK: బ్రిటన్‌లో చదువుతున్న భారత సంతతికి చెందిన ఓ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. పిల్లల వేధింపులకు సంబంధించిన కేసులో శనివారం కేరళకు చెందిన విద్యార్థిని అరెస్టు చేసినట్లు యునైటెడ్ కింగ్‌డమ్ (యుకె) పోలీసులు తెలిపారు. కేరళలోని కొట్టాయం జిల్లా (Kottayam district) రామాపురం ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల యువకుడు బ్రిటన్ (Britan) బాలల సంరక్షణ బృందం జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో పట్టుబడ్డాడు. నివేదికల ప్రకారం.. ఆ వ్యక్తి సెక్స్ కోసం సోషల్ మీడియాలో పరిచయమైన 14 ఏళ్ల మైనర్ బాలికను సంప్రదించాడు. సోషల్ మీడియాలో యువతులపై ఆరా తీస్తున్న వారిని పట్టుకోవడానికి బాలల రక్షణ బృందం రూపొందించిన ప్రొఫైల్ గురించి అతనికి తెలియదు. ఈ క్రమంలో బాలికను ప్రలోభపెట్టిన తర్వాత ఆ యువకు లండన్‌లోని ఓ హోటల్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అతను లూటన్‌లోని తన ఇంటి నుంచి దాదాపు గంటసేపు ప్రయాణించి, ఆ అమ్మాయిని బస చేసిన హేమెల్ హెంప్‌స్టెడ్‌కు చేరుకున్నాడు. అయితే.. అప్పటికే ట్రేస్ చేసిన బాలల సంరక్షణ బృందం, పోలీసులు అక్కడికి చేరుకొని నిఘా వేసి పట్టుకున్నారు.

చదువుకుంటూ.. కేర్‌టేకర్‌గా పనిచేస్తున్న యువకుడు ఈ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఇది తెలిసి ముందు అతను తప్పించుకోవడానికి ప్రయత్నించాడని.. చివరకు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రూ.15 లక్షలు వెచ్చించి యూకేలో చదువుకునేందుకు వచ్చానని.. అనుకోకుండా పొరపాటు జరిగిందని యువకుడు పోలీసులకు తెలియజేశాడు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు. కాగా.. చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత అతనిని స్వదేశానికి పంపించనున్నారు. అయితే.. బాలల సంరక్షణ బృందం సృష్టించిన మరో రెండు ప్రొఫైల్‌లలో కూడా అతను చాట్ చేస్తున్నాడని అధికారుల బృందం తెలిపింది.

Also Read:

Telangana: మాతృభూమిపై మమకారం చాటుకుంటోన్న ఎన్నారైలు.. మన ఊరు- మనబడికి విరాళాల వెల్లువ..

Indian Embassy: ఇరాన్‌లో చిక్కుపోయిన ఇద్దరు భారతీయులకు విముక్తి.. భారత మారిటైమ్ యూనియన్ చొరవతో విడుదల