AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త.. రేపటి నుంచే ఆఫ్‌లైన్‌ సర్వదర్శనం టోకెన్ల జారీ.. పూర్తి వివరాలివే..

తిరుమల శ్రీవారి (Tirumala Srivari)ని దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త. కరోనా కారణంగా నిలిపివేసిన ఆఫ్‌లైన్‌ సర్వదర్శనం (Sarvadarshanam) టికెట్లను పునరిద్ధరించాలని టీటీడీ (TTD) నిర్ణయించింది

Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త.. రేపటి నుంచే ఆఫ్‌లైన్‌ సర్వదర్శనం టోకెన్ల జారీ.. పూర్తి వివరాలివే..
Basha Shek
|

Updated on: Feb 14, 2022 | 6:30 AM

Share

తిరుమల శ్రీవారి (Tirumala Srivari)ని దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త. కరోనా కారణంగా నిలిపివేసిన ఆఫ్‌లైన్‌ సర్వదర్శనం (Sarvadarshanam) టికెట్లను పునరిద్ధరించాలని టీటీడీ (TTD) నిర్ణయించింది. ఈ మేరకు రేపటి (ఫిబ్రవరి 15) నుంచి ఈ టికెట్లను భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది. 16వ తేదీ దర్శనం కోసం 15న ఉదయం 9 గంటలకు టీటీడీ టోకెన్లు జారీ చేయనుంది. తిరుపతి(Tirupati)లోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవింద రాజ స్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ సర్వదర్శనం టోకెన్లు జారీ చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. నిత్యం 15 వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చెయ్యాలని టీటీడీ  ఏర్పాట్లు చేసింది . కరోనా కారణంగా 2020 మార్చి తర్వాత ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ నిలిపేసింది. ప్రస్తుతం కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో భక్తులకు సర్వదర్శనం టోకెన్లు ఇచ్చేందుకు టీటీడీ సమాయత్తమైంది. కాగా రెండేళ్ల తర్వాత మొదటిసారిగా అత్యధిక సంఖ్యలో సర్వదర్శనం టోకెన్లను టీటీడీ విడుదల చేస్తోంది.

రోజూ 15వేల టికెట్లు..

గత ఏడాది రోజుకు 2వేల చొప్పున ఆఫ్‌లైన్‌ సర్వదర్శనం టికెట్లు జారీ చేసినా.. కొవిడ్‌కు తోడు భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ వాటిని నిలిపేసింది. ప్రస్తుతం ఆన్ లైన్ లో మాత్రమే రోజుకు 5వేల చొప్పున శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ప్రతి నెల విడుదల చేస్తోంది.ప్రస్తుతం టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 టికెట్లు), వర్చువల్ సేవా, వీఐపీ సిఫార్సులు, ఆన్ లైన్ సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి మాత్రమే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. దీంతో ప్రతిరోజు 25-30 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో రోజు15 వేల టోకెన్లు జారీ చేసేందుకు టీటీడీ సిద్ధమైంది. దీంతో నిత్యం శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 40 వేలు దాటి పోయే అవకాశం ఉంది. 16వ తేదీన శ్రీవారిని దర్శించుకోవాలి అనుకునే వారు.. ఒఖ రోజు ముందుగానే టోకెన్లు తీసుకోవాల్సి ఉంటుంది.

Also Read:PSLV-C52: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ52 రాకెట్..

GT IPL 2022 Auction: సిద్ధమైన గుజరాత్ సైన్యం.. తొలి సీజన్‌లో అద్భుతాలు చేసే హార్దిక్ టీం ఇదేనా..

MI, IPL 2022 Auction: ఐదోసారి ట్రోఫీకి సిద్ధమైన రోహిత్ సేన.. ముంబై ఇండియన్స్‌ ఫ్యామిలీ ఎలా ఉందో చూశారా?

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?