Silver Price Today: నిలకడగా వెండి ధరలు.. ఈరోజు హైదరాబాద్, విజయవాడలో సిల్వర్ రేట్స్ ఇలా..
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పరుగులు పెడుతుంటే వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. గత రెండు రోజులుగా
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పరుగులు పెడుతుంటే వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. గత రెండు రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ మహిళలకు షాకిస్తున్నాయి. రోజు రోజూకీ బంగారం, సిల్వర్ రేట్స్ హెచ్చుతగ్గులు జరుగుతుంటాయి. ఇప్పుడున్న పెళ్లిళ్ల సీజన్లలో గోల్డ్, సిల్వర్ రేట్స్ పై జనాలు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో బంగారం ధరలు మాత్రం రోజూ రోజూకీ షాకిస్తుండగా.. వెండి ధరలు మాత్రం కాస్త ఊరట కలిగిస్తున్నాయి. ఈరోజు ఉదయం పది గ్రాముల వెండి ధర రూ. 6,300కు చేరగా.. కేజీ సిల్వర్ రేట్ రూ. 63,000కు చేరింది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ. 67,400 దగ్గర కొనసాగుతుంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కేజీ సిల్వర్ రేట్ రూ. 63,000కు చేరింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 63,000కు చేరింది. అలాగే చెన్నై, బెంగుళూరులో కిలో వెండి రూ. 67,400 వద్ద కొనసాగుతుంది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లో కేజీ సిల్వర్ రేట్ రూ. 67,400 వద్ద ఉండగా.. పది గ్రాముల వెండి ధర రూ. 674 ఉంది. ఇక హైదరాబాద్ లో కూడా పది గ్రాముల వెండి ధర రూ. 674 వద్ద కొనసాగుతుంది. మరోవైపు.. ఈరోజు ఉదయం బంగారం ధరలు ఆకాశాన్న తాకుతున్నాయి. ఈరోజు ఉదయం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఏకంగా రూ.51 వేలు దాటింది. ఈరోజూ ఉదయం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 51,060కు చేరింది. ఈరోజు ఉదయం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46, 810కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 51,060కు చేరింది.
Also Read: Krithi Shetty: ఉప్పెన సినిమా విడుదలై ఏడాది పూర్తి .. ఎమోషనల్ నోట్ పెట్టిన బేబమ్మ..
Actor Photo: ఈ ఫోటోలో ఉన్న చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో.. అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఎక్కువ..