Gurtunda Seethakalam: వాలెంటైన్స్ డే రోజున మరో స్పెషల్ అప్డేట్.. అందమైన ప్రేమకథ గుర్తుందా శీతాకాలం ట్రైలర్ రేపే..

టాలెంటెడ్ హీరో సత్యదేవ్ (Sathyadev).. మిల్కీ బ్యూటీ తమన్నా (Thamannah) జంటగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం గుర్తుందా శీతాకాలం(Gurthunda Seethakalam).

Gurtunda Seethakalam: వాలెంటైన్స్ డే రోజున మరో స్పెషల్ అప్డేట్.. అందమైన ప్రేమకథ గుర్తుందా శీతాకాలం ట్రైలర్ రేపే..
Gurthunda Seethakalam
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 13, 2022 | 9:09 PM

టాలెంటెడ్ హీరో సత్యదేవ్ (Sathyadev).. మిల్కీ బ్యూటీ తమన్నా (Thamannah) జంటగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం గుర్తుందా శీతాకాలం(Gurthunda Seethakalam). ఈ చిత్రానికి డైరెక్టర్ నాగ శేఖర్ దర్శకత్వం వహిస్తుండగా.. నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్, మణికంఠ ఎంటర్‌టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ బ్యానర్స్‌పై భావ‌న‌ ర‌వి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడులైనన పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

వాలెంటైన్స్ డే సందర్భంగా రేపు (ఫిబ్రవరి 14న) ఈ సినిమా ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. ఈ మేరకు గుర్తుందా శీతాకాలం నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్ విడుదల చేసింది. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ మూవీలో మేఘా ఆకాష్, కావ్యశెట్టి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కన్నడ హిట్ మూవీ ‘లవ్ మాక్‌టైల్’కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం తమన్నా.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. అలాగే.. వెంకటేష్.. వరుణ్ తేజ్ కాంబోలో వస్తున్న ఎఫ్ 3 మూవీలో నటిస్తోంది.

Also Read: Valentine’s Day: రాశిని బట్టి డ్రస్ కలర్.. ప్రేమికుల రోజున ధరిస్తే.. లవ్ సక్సెస్ అయినట్టే..

Viral Video: పుష్ప క్రేజ్ అస్సలు తగ్గడం లేదుగా.. రష్మిక.. అల్లు అర్జున్ డైలాగ్ ఎలా చెప్పారో మీరే చూడండి..

Sarkaru Vaari Paata: కళావతి ఒరిజినల్ వచ్చేసింది.. అదిరిపోయిన మహేష్ కీర్తి కెమిస్ట్రీ..

Sitara Gattamaneni: మహేష్ ముద్దుల కూతురు సితార ఎవరితో పైట్ చేస్తోంది గుర్తించండి.. మహేష్ ? గౌతమ్ ఆ ?..