AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Hanuman: మనదేశంలో ఆ గ్రామంలో హనుమంతుడి పేరు తలచినా నేరం.. ఇప్పటికీ ఆయన్ని క్షమించని ప్రజలు ఎందుకంటే..

Lord Hanuman: శివుడు, హనుమంతుండు, గణేశుడు, రాముడు, దుర్గ,కాళిక వంటి అనేకమంది దేవుళ్ళను హిందువులు అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. అయితే రామ భక్త హనుమంతుడి వివిధ పేర్లతో దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో

Lord Hanuman: మనదేశంలో ఆ గ్రామంలో హనుమంతుడి పేరు తలచినా నేరం.. ఇప్పటికీ ఆయన్ని క్షమించని ప్రజలు ఎందుకంటే..
Drongiri Village Uttarakhand
Surya Kala
|

Updated on: Feb 13, 2022 | 11:11 PM

Share

Lord Hanuman: శివుడు, హనుమంతుండు, గణేశుడు, రాముడు, దుర్గ,కాళిక వంటి అనేకమంది దేవుళ్ళను హిందువులు అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. అయితే రామ భక్త హనుమంతుడి వివిధ పేర్లతో దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పూజలను అందుకుంటున్నాడు. హనుమంతుడిని పూజించడం వలన తమ కష్టాలు తీరతాయని భక్తుల నమ్మకం. అయితే మనదేశంలో ఓ ప్రాంతంలో హనుమంతుడికి పూజించరు సరికదా అక్కడ ఆయన పేరుని కూడా పలకరు.. హనుమంతుడిని పూజించడం నేరంగా పరిగనిస్తారు. మరి ఎందుకు అక్కడ హనుమంతుడిని పూజించరో తెలుసుకుందాం.

హనుమంతుడిని పూజించని గ్రామం: ఉత్తరాఖండ్‌లోని చమోలిలో ఉన్న దునగిరి గ్రామంలో ఒక నమ్మకం ఉంది. ఇక్కడ హనుమంతుడు ఒకప్పుడు అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మణుని చికిత్స కోసం సంజీవని పర్వతాన్ని తమ ప్రాంతం నుంచి తీసుకుని వెళ్ళారని ఈ ప్రాంతవాసుల నమ్మకం. రామాయణ కాలంలో హనుమంతుడు సందర్శించిన ప్రదేశాలు నేడు పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందాయి, అయితే ఈ గ్రామంలో హనుమంతుడు వెళ్ళినప్పటికీ ఇక్కడి ప్రజలు రామ భక్తుడు, సేవకుడైన ఆంజనేయస్వామిని పూజించరు.ఈ గ్రామంలో హనుమంతుడికి ఒక్క గుడి కూడా కనిపించదు.

రామాయణ కాలంలో రామ రావణ యుద్ధం జరుగుతున్నది. అప్పుడు రావణుడి తనయుడు మేఘనాథుడి తో లక్ష్మణుడు యుద్ధం చేస్తున్న సమయంలో మేఘనాధుని బాణం తగిలి లక్ష్మణుడు మూర్ఛపోయాడు. దీంతో వైద్యుడు అతని చికిత్స కోసం సంజీవని తీసుకుని రమ్మనమని సూచించాడు. ఆ తర్వాత హనుమంతుడు సంజీవని కోసం వెతుకుతూ హిమాలయ పర్వతాలలో ఉన్న ఈ ప్రదేశానికి వెళ్ళాడు. హిమాలయ పర్వత ప్రాంతమైన ఉత్తరాఖండ్ లోని ద్రోనగిరి ప్రాంతానికి  చెందిన ఒక మహిళ సంజీవనిని ఉన్న పర్వతాన్ని ఆంజనేయస్వామికి చూపించిందని.. అయితే హనుమాన్ కు సంజీవని అర్ధం కాక మొత్తం పర్వతాన్ని ఆ గ్రామం నుంచి తనతో పాటు తీసుకుని వెళ్ళాడు. అప్పటి నుండి ఇక్కడి ప్రజలకు తమకు సంజీవనిని దూరం చేసిన హనుమంతుడు అంటే చాలా కోపం. ఆయనను ఎప్పుడూ పూజించరు. కనీసం పేరు కూడా పలకరు.. నేటికీ, ఈ గ్రామంలో హనుమంతుని పూజించడం నేరంగా పరిగణించబడుతుంది.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు , నమ్మకం, విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Read Also :  నాకు మగధీర హీరో రామ్ చరణ్ అంటే ఇష్టం.. ఆర్ఆర్ఆర్ కోసం ఎదురుచూస్తున్నా అంటున్న బాలీవుడ్ స్టార్ హీరో..

మేడారం జాతరకు నిధులను మంజూరు చేసిన కేంద్రం.. గిరిజనుల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న మంత్రి కిషన్ రెడ్డి..