Shanmukh Jashwanth: దీప్తితో బ్రేకప్ పై షణ్ముఖ్ షాకింగ్ కామెంట్స్.. అసలు కారణం ఇదే అంటూ..

షణ్ముఖ్ జస్వంత్ (shanmukh jashwanth).. సాఫ్ట్‏వేర్ డెవలపర్, సూర్య వంటి వెబ్ సిరీస్‏లతో ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

Shanmukh Jashwanth: దీప్తితో బ్రేకప్ పై షణ్ముఖ్ షాకింగ్ కామెంట్స్.. అసలు కారణం ఇదే అంటూ..
Shanmukh
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 15, 2022 | 8:02 AM

షణ్ముఖ్ జస్వంత్ (shanmukh jashwanth).. సాఫ్ట్‏వేర్ డెవలపర్, సూర్య వంటి వెబ్ సిరీస్‏లతో ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో ఓ స్టార్ హీరోకు ఉన్న ఫాలోవర్లు షణ్ముఖ్‏కు ఉన్నారు. చిన్న షార్ట్ ఫిల్మ్స్, సాంగ్స్ చేస్తూ ఉన్న షణ్ముఖ్ జస్వంత్ క్రేజ్ సాఫ్ట్‏వేర్ డెవలపర్ సిరీస్‏తో ఒక్కసారిగా మారిపోయింది. ఈ సిరీస్ తర్వాత వచ్చిన సూర్య కూడా అదే రేంజ్‎లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక అదే క్రేజ్ క్రేజ్‏తో బిగ్‏బాస్ సీజన్ 5లోకి అడుగుపెట్టాడు. అయితే షన్నూ బిగ్‏బాస్ సీజన్ 5 విన్నర్ అవుతాడని అంతా అనుకున్నారు. మొదటి నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని బిగ్‏బాస్ టైటిల్ రేసులో ముందున్న షణ్ముఖ్ ఆ తర్వాత.. సిరితో స్నేహం.. శ్రుతి మించిన హగ్గులతో తనను మరింత దిగజార్చుకున్నాడు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ ప్రవర్తన వలన ఇమేజ్ డ్యామేజ్ కావడమే కాకుండా.. ఎప్పటినుంచో తనకు అన్ని విషయాల్లో మద్దతుగా ఉన్న ప్రియురాలు దీప్తి సునయన కూడా దూరమైంది. అయితే బ్రేకప్ అనంతరం షణ్ముఖ్ సోషల్ మీడియాలో హర్ట్ బ్రేక్ సింబల్స్, మూడ్ ఆఫ్ ఫోటోస్ షేర్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా షణ్ముఖ్.. దీప్తితో బ్రేకప్ పై మరోసారి స్పందించారు. మా ఇద్దరికి సిరి కారణం కాదని.. తనకు సిరి ఎప్పటికీ మంచి స్నేహితురాలు అని చెప్పుకొచ్చాడు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానెల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. షణ్ముఖ్ మాట్లాడుతూ.. నేను ఇతరులతో తక్కువగా మాట్లాడతాను. ప్రేక్షకులలో నాకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకోవడానికే రియాల్టీ షోకు వెళ్లాను. నా గురించి పాజిటివ్ ఆలోచిస్తారు అనుకున్నా.. కానీ షో నుంచి బయటకు వచ్చాక తెలిసింది నాపై అంత నెగిటివిటీ వచ్చిందో అర్థమైంది. నేను 27 సంవత్సరాల వయసులోనే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వీటివలన ఇంకా జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి అనేది నేర్చుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు.

అలాగే.. హౌస్ లో ఉన్నప్పుడు సిరికి అండగా నిలబడ్డాను..మేమిద్దరం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. దీంతో మా ఇద్దరి మధ్య కాస్త చనువు పెరిగింది. కానీ దీనివల్లే మాపై వ్యతిరేకత వచ్చింది. సిరి వాళ్లమ్మ వచ్చి మీరిద్దరు హగ్ చేసుకోవడం నచ్చలేదని చెప్పింది. చాలా భాదనిపించింది. నాకు ఆమె అలా మాట్లాడటం నచ్చలేదు. సిరి వాళ్లమ్మ నా గురించి తప్పుగా అనుకోవడం తట్టుకోలేకపోయాను. దీప్తి నేను విడిపోవడానికి చాలా కారణాలున్నాయి. నా వల్ల దీప్తి ఎంతో నెగిటివిటీని ఎదుర్కొంది. నెటిజన్స్ నన్ను ట్రోల్ చేస్తున్నప్పుడు తను నాకు సపోర్ట్ చేసింది. సిరితో చనువుగా ఉండడం వలన తన కుటుంబం నుంచి తనకు ఒత్తిడి పెరిగింది. ఇకనైన తను సంతోషంగా ఉండాలనే ఉద్ధేశంతోనే బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మేము మా కెరీర్ పై దృష్టి పెట్టాం… మేము మళ్లీ కలుస్తామా ? లేదా ? అనేది దేవుడి చేతుల్లో ఉంది. విధి మా జీవితాల్లో ఏది రాస్తే అదే జరుగుతుందని నమ్ముతున్నాను.. మా బ్రేకప్ గురించి సిరిని నిందించడం సరైనది కాదు..తప్పు నాదే అందుకు నన్ను నిందించాలి అని షణ్ముఖ్ అన్నారు.

Also Read: Rudra: ఆద్యంతం ఉత్కంఠ భరితంగా రుద్ర వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌.. నటనతో ఆకట్టుకున్న రాశీ ఖన్నా..

Kalavathi Song: దూసుకుపోతున్న కళావతి సాంగ్‌.. సౌత్‌ ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీలోనే తొలి పాటగా..

Vijay Beast: విజయ్‌ బీస్ట్‌ నుంచి లిరికల్‌ సాంగ్‌.. అదిరిపోయే స్టెప్స్‌తో మరోసారి ఆకట్టుకున్న ‘బుట్టబొమ్మ’..

Upasana: ‘పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారనేది నిజం కాదు’.. వాలంటైన్స్‌డే రోజు ఆసక్తికరమైన వీడియోను షేర్‌ చేసిన ఉపాసన..