Kalavathi Song: దూసుకుపోతున్న కళావతి సాంగ్‌.. సౌత్‌ ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీలోనే తొలి పాటగా..

Kalavathi Song: 2020లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా తర్వాత మహేష్‌ బాబు నటిస్తోన్న చిత్రం 'సర్కారు వారి పాట'. తమ అభిమాన హీరోను వెండితెరపై చూడక రెండేళ్లు అవుతోన్న నేపథ్యంలో మహేష్‌ అభిమానులు ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు...

Kalavathi Song: దూసుకుపోతున్న కళావతి సాంగ్‌.. సౌత్‌ ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీలోనే తొలి పాటగా..
Kalavathi Song
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 14, 2022 | 8:00 PM

Kalavathi Song: 2020లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత మహేష్‌ బాబు నటిస్తోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. తమ అభిమాన హీరోను వెండితెరపై చూడక రెండేళ్లు అవుతోన్న నేపథ్యంలో మహేష్‌ అభిమానులు ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు పరశురామ్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో ఉన్న ఈ సినిమాను మే 12న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్‌ మొదలు పెట్టిన చిత్ర యూనిట్‌ ఆదివారం సినిమాలోని తొలి లిరికల్ సాంగ్‌ ‘కళావతి’ పాటను విడుదల చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ పాటను అధికారికంగా విడుదల చేసే కంటే ముందే సోషల్‌ మీడియాలో లీక్‌ అయింది. దీంతో చిత్రయూనిట్‌ ఒకరోజు ముందే పాటను అధికారికంగా విడుదల చేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ లిరికల్‌ వీడియో సాంగ్‌ హల్చల్‌ చేస్తోంది. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో గత రికార్డులను తిరగరాస్తోంది. అత్యధిక వ్యూస్‌ సాధించిన వీడియోగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ విషయాన్ని తాజాగా చిత్ర యూనిట్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించింది. కళావతి పాట కేవలం 24 గంటల్లోనే 16 మిలియన్లకుపైగా వ్యూస్‌, 8 లక్షలకుపైగా లైక్స్‌తో సరికొత్త రికార్డు నెలకొలిపింది.

ఇలా కేవలం 24 గంట్లలో ఈ పాట సౌత్‌ ఇండియాలోనే అత్యధిక వ్యూస్‌ సాధించిన తొలి పాటగా, టాలీవుడ్‌లో ఒకరోజులో అత్యధిక లైక్స్‌ దక్కించుకున్న వీడియోగా సరికొత్త రికార్డును అందుకుంది. అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించిన ఈ పాటను యంగ్ సెన్సేషన్‌ సిద్‌ శ్రీరామ్‌ అలపించారు. తమన్‌ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.

Also Read: Andhra Pradesh: ఏపీలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత.. కానీ ఆ ఆంక్షలు యథాతథం

Ranveer Singh: అమ్మాయిల కలల రాకుమారుడు.. నెట్టింట వైరల్ అవుతోన్న మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఫోటోలు.

Kishanreddy on KCR: సర్జికల్ స్ట్రైక్స్‌పై వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం.. సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫైర్!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?