AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Beast: విజయ్‌ బీస్ట్‌ నుంచి లిరికల్‌ సాంగ్‌.. అదిరిపోయే స్టెప్స్‌తో మరోసారి ఆకట్టుకున్న ‘బుట్టబొమ్మ’..

Vijay Beast: తమిళ స్టార్‌ హీరో విజయ్‌, పూజా హెగ్డే ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కిన చిత్రం 'బీస్ట్‌'. ఈ సినిమా కోసం విజయ్‌ ఫ్యాన్స్‌ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. నెల్సన్‌ దర్శకత్వం వహిస్తున్న...

Vijay Beast: విజయ్‌ బీస్ట్‌ నుంచి లిరికల్‌ సాంగ్‌.. అదిరిపోయే స్టెప్స్‌తో మరోసారి ఆకట్టుకున్న 'బుట్టబొమ్మ'..
Vijay Beast Song
Narender Vaitla
|

Updated on: Feb 14, 2022 | 7:24 PM

Share

Vijay Beast: తమిళ స్టార్‌ హీరో విజయ్‌, పూజా హెగ్డే ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కిన చిత్రం ‘బీస్ట్‌’. ఈ సినిమా కోసం విజయ్‌ ఫ్యాన్స్‌ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. నెల్సన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల చేయనున్నారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు అవుతోన్నా ఈ సినిమా నుంచి పెద్దగా అప్‌డేట్స్‌ లేకపోయేసరికి విజయ్‌ ఫ్యాన్స్‌ కాస్త నిరాశకు గురయ్యారు. దీంతో అభిమానుల నిరీక్షణకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ బీస్ట్‌ మూవీ యూనిట్‌ తాజాగా సినిమాలోని ఫస్ట్‌ సింగిల్‌ను విడుదల చేసింది.

వాలంటైన్స్‌డేను పురస్కరించుకొని బీస్ట్‌ సినిమాలోని ‘అరబిక్ కుతు’ అనే పాట లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాకు సంగీతం అందించిన అనిరుధ్‌ మరోసారి తన సత్తా చాటాడు. అనిరుధ్‌ ఈ పాటను తానే స్వయంగా పాడడం మరో విశేషం. ఇక పాటను చాలా రిచ్‌గా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా విజయ్‌, పూజాల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అయింది. బుట్టబొమ్మ పాటలో స్టెప్స్‌తో యువతను ఉర్రుతలుగించిన పూజా హెగ్డే మరోసారి ఈ పాటతో ఆకట్టుకుంది. పూజా అందం, స్టెప్స్‌తో మెస్మరైజ్‌ చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 14న విడుదల చేయనున్నారు.

Also Read: Tik Talk Viral Video: టిక్ టాక్ కోసం పెదాలకు సర్జరీ చేసుకున్న వీర వనిత.. సీన్‌ రివర్స్‌ అయి ఇప్పుడిలా…!వీడియో

Nayanthara: నయన్‌, విఘ్నేశ్‌ల వాలంటైన్స్‌డే వేడుకలు చూశారా.? అర్థరాత్రి ప్రియుడిని సర్‌ప్రైజ్‌ చేస్తూ..

Mamata Banerjee Call To CM KCR: మమతా ర్యాలీకి సీఎం కేసీఆర్…! అవసరం అయితే కొత్త పార్టీ పెడతా..:కేసీఆర్..(వీడియో)