AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara: నయన్‌, విఘ్నేశ్‌ల వాలంటైన్స్‌డే వేడుకలు చూశారా.? అర్థరాత్రి ప్రియుడిని సర్‌ప్రైజ్‌ చేస్తూ..

Nayanthara: ప్రేమించిన వ్యక్తిపై ప్రతిరోజూ ప్రేమను కురిపించినా, ఫిబ్రవరి 14న తెలిపే విషెస్‌కు ఎక్కడలేని ప్రాధాన్యత ఉంటుంది. వాలంటైన్స్‌ డే రోజున తమ ప్రేమను వ్యక్తపరచడానికి బెస్ట్‌ డే అని చాలా మంది భావిస్తుంటారు. అందుకే తమ ప్రేమను ఈరోజే వ్యక్తపరుస్తుంటారు. ఇది కేవలం సామాన్యులకే...

Nayanthara: నయన్‌, విఘ్నేశ్‌ల వాలంటైన్స్‌డే వేడుకలు చూశారా.? అర్థరాత్రి ప్రియుడిని సర్‌ప్రైజ్‌ చేస్తూ..
Nayanathara
Narender Vaitla
|

Updated on: Feb 14, 2022 | 4:51 PM

Share

Nayanthara: ప్రేమించిన వ్యక్తిపై ప్రతిరోజూ ప్రేమను కురిపించినా, ఫిబ్రవరి 14న తెలిపే విషెస్‌కు ఎక్కడలేని ప్రాధాన్యత ఉంటుంది. వాలంటైన్స్‌ డే రోజున తమ ప్రేమను వ్యక్తపరచడానికి బెస్ట్‌ డే అని చాలా మంది భావిస్తుంటారు. అందుకే తమ ప్రేమను ఈరోజే వ్యక్తపరుస్తుంటారు. ఇది కేవలం సామాన్యులకే పరిమితమా అంటే కచ్చితంగా కాదనే సమాధానం వస్తుంది. సెలబ్రిటీ ప్రేమికుల్లో ముందు వరుసలో ఉండే నయనతార, విఘ్నేలు వాలంటైన్స్‌ డే గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేస్తున్నారు.

నయనతార తాను ఎంతగానో ప్రేమిస్తున్న విఘ్నేష్‌కు ఫ్లవర్‌ బొకే ఇచ్చి ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. అంతేనా విఘ్నేష్‌ను అప్యాయంగా హగ్‌ చేసుకొంది. అయితే తన ప్రేమికుడికి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన నయనతార, అర్థరాత్రి సరిగ్గా 12 దాటగానే విషెస్‌ చెప్పింది. వీరిద్దరు విషెస్‌ చెప్పుకునే సందర్భంలో తీసిన వీడియోను విఘ్నేష్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోతో పాటు విఘ్నేష్‌ ఆసక్తికరమైన కామెంట్‌ చేశారు. ‘మొట్టమొదటి సారిలా తను అలా వచ్చి, ఫ్లవర్స్‌ ఇస్తే.. నిజంగా అది కచ్చితంగా సంతోషకరమైన ప్రేమికుల దినోత్సవం’ అని రాసుకొచ్చారు. దీంతో వీరిద్దరి ప్రేమ ఎంత బలమైందో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే నయనతారతో దిగిన ఫోటోలతో మరో పోస్ట్‌ చేసిన విఘ్నేష్‌.. ‘అందరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు. జీవితానికి పరిపూర్ణత ఇచ్చేది ప్రేమ ఒక్కటే. కాబట్టి ప్రేమించిన వారికి సమయం కేటాయించండి’ అంటూ ఆసక్తికరమైన కామెంట్ చేశారు.

Also Read: Railway Employees: రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో వారికి నైట్‌ డ్యూటీ అలవెన్స్‌..!

Viral News: ఔరంగజేబు కట్టిన మినీ తాజ్‌మహల్‌ ఎక్కడుందో తెలుసా?

Radhe Shyam Glimpse: రాధేశ్యామ్ వాలెంటైన్ గ్లింప్స్ వచ్చేసింది.. ప్రభాస్.. పూజా హెగ్డే వీడియో అదుర్స్..