Rudra: ఆద్యంతం ఉత్కంఠ భరితంగా రుద్ర వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌.. నటనతో ఆకట్టుకున్న రాశీ ఖన్నా..

Rudra: ఆద్యంతం ఉత్కంఠ భరితంగా రుద్ర వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌.. నటనతో ఆకట్టుకున్న రాశీ ఖన్నా..
Rudra Trailer

Rudra: ప్రస్తుతం ఓటీటీ మార్కెట్‌ ఓ రేంజ్‌లో విస్తరిస్తోంది. ఓటీటీ వేదికగా సినిమాలను తలదన్నె కంటెంట్‌తో మేకర్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇలా వస్తోన్న వెబ్‌ సిరీస్‌లలో రుద్ర ఒకటి. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ నటిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌లో రాశీ ఖన్నా కూడా నటిస్తోన్న విషయం...

Narender Vaitla

|

Feb 14, 2022 | 8:38 PM

Rudra: ప్రస్తుతం ఓటీటీ మార్కెట్‌ ఓ రేంజ్‌లో విస్తరిస్తోంది. ఓటీటీ వేదికగా సినిమాలను తలదన్నె కంటెంట్‌తో మేకర్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇలా వస్తోన్న వెబ్‌ సిరీస్‌లలో రుద్ర ఒకటి. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ నటిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌లో రాశీ ఖన్నా కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే. లూథర్‌ అనే పాపులర్‌ బ్రిటీష్‌ వెబ్‌ సిరీస్‌ ఆధారంగా ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ వేదికగా మార్చి 4న టెలికాస్ట్‌ కానున్న ఈ వెబ్‌ సిరీస్‌పై అందరిలోనూ ఆసక్తినెలకొంది. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర యూనిట్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది. రెండు నిమిషాల నిడివి ఉన్న ‘రుద్ర’ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా ఉంది.

ఈ వెబ్‌ సిరీస్‌లో అజయ్‌ దేవగణ్‌ పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. మనుషులను అత్యంత కృరంగా చంపుతూ పైశాశిక ఆనందం పొందుతోన్న ఓ సీరియల్‌ కిల్లర్‌ను పట్టుకునే బాధ్యతను తీసుకున్న అజయ్‌ దేవగణ్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో రుద్ర ఏం కోల్పోయాడు. చివరికి కిల్లర్‌ను అరెస్ట్‌ చేశాడా అన్న కథాంశంతో ఈ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించారు. ‘చీకట్లో దాక్కున్న వాళ్లను నేను అక్కడికి వెళ్లే పట్టుకుంటాను’ అని అజయ్‌ చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది.

ఇక రాశీ ఖన్నా తొలిసారిగా నటిస్తోన్న ఈ వెబ్‌ సిరీస్‌లో విభిన్న పాత్రలో కనిపిస్తోంది. రాశీ ఇప్పటి వరకు కనిపించని పాత్రలో ఆకట్టుకుంది. అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, బీబీసీ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌ హిందీతో పాటు తెలుగు, కన్నడ, మరాఠీ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదల చేయనున్నారు.

Also Read: Health Tips: మీకు ఈ సమస్యలు వెంటాడుతున్నాయా..? వంట గదిలో ఉండే వాటితో అద్భుతమైన ఫలితాలు

Upasana: ‘పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారనేది నిజం కాదు’.. వాలంటైన్స్‌డే రోజు ఆసక్తికరమైన వీడియోను షేర్‌ చేసిన ఉపాసన..

Andhra Pradesh: రోడ్ల పక్కన దాబాల్లో మద్యం బంద్.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu