AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మీకు ఈ సమస్యలు వెంటాడుతున్నాయా..? వంట గదిలో ఉండే వాటితో అద్భుతమైన ఫలితాలు

Health Tips: ప్రస్తుతం ఆనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. రకరకాల అనారోగ్య కారణాల వల్ల ఆస్పత్రుల చుట్టు తిరగాల్సి వస్తుంది. అయితే కొన్ని ఇంట్లో ఉండే..

Health Tips: మీకు ఈ సమస్యలు వెంటాడుతున్నాయా..? వంట గదిలో ఉండే వాటితో అద్భుతమైన ఫలితాలు
Subhash Goud
|

Updated on: Feb 14, 2022 | 5:06 PM

Share

Health Tips: ప్రస్తుతం ఆనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. రకరకాల అనారోగ్య కారణాల వల్ల ఆస్పత్రుల చుట్టు తిరగాల్సి వస్తుంది. అయితే కొన్ని ఇంట్లో ఉండే వస్తువులను వాడుతుంటే మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవచ్చంటున్నారు ఆయుర్వేద నిపుణులు. మారుతున్న కాలనుగుణంగా జీవన శైలిలో ఎంతో మార్పు వస్తుంది. ప్రతి రోజు ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులు, ఇతర టెన్షన్‌, మానసిక ఆందోళన తదితర కారణాల వల్ల చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నాడు. దీంతో ఆస్పత్రుల చుట్టూ తిరగడం, మెడిసిన్ వాడటం వంటివి చేస్తుంటాయి. కానీ కొన్ని పద్దతులు పాటించడం వల్ల ఇంట్లోనే ఉండి మన ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లో ఉండే కొన్ని వస్తువుల ద్వారా ఉండే ప్రయోజనాలను మీకు అందిస్తున్నాము.

పెరుగు

పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది కడుపులో మంట, నొప్పి, ఉబ్బరం వంటి లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పెరుగు జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. కడుపు నొప్పి, తిమ్మిరి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

పుదినా

పుదీనా కండరాల నొప్పి, పంటి నొప్పి, తలనొప్పి, నరాల నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు సహాయ పడుతుంది. కొన్ని ఆకులను నమలడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడరాలకు, నరాలకు విశ్రాంతి కలిగించేలా సహాయపడుతుంది.

అల్లం

అల్లంలోని యాంటీ ఇన్‌ప్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, కడుపు నొప్పి, ఛాతి నొప్పి, బహిష్టు నొప్పిని తగ్గించడంలో అల్లం ఎంతగానో సహాయపడుతుంది. గ్యాస్‌ సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇక అల్లం చాయ్‌ను సిప్‌ చేయడం వల్ల మైగ్రేన్‌ల నుంచి ఉపశమనం లభిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల విషయంలో కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దగ్గు, గొంతు నొప్పి వంటి వాటికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

లవంగాలు

యాంటీ ఇన్‌ఫ్లిమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పంటి నొప్పిని తగ్గించడానికి, నోటి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. పంటి నొప్పి ఉన్నట్లయితే రెండు లవంగాలను గ్రైండ్ చేసి, ఆ పొడిని కొద్దిగా ఆలివ్ నూనెలో కలపండి. తర్వాత ఇన్ఫెక్షన్‌ ఉన్న ప్రాంతంలో రాయండి. దీంతో తక్షణ ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఏదైనా వాపును తగ్గించడానికి సహాయపడుతుంది.

వెల్లుల్లి

వెల్లుల్లిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ గుణాలు కలిగిన వెల్లుల్లి వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. నోటి కుహరాలు లేదా అంతర్గత పరాన్నజీవులు, చెవి ఇన్ఫెక్షన్లు లేదా ఆర్థరైటిక్ నొప్పి, వెల్లుల్లి వాటన్నింటితో పోరాడుతుంది. వెల్లుల్లిని కాల్చిన, వండినా దాంట్లో ఔషధ గుణాలు కోల్పోవచ్చు.. అందుకే పచ్చిగా తినేటప్పుడు ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. చెవి ఇన్ఫెక్షన్ల విషయంలో కూడా బాగా పని చేస్తుంది. కొన్ని వెల్లుల్లిలను తీసుకుని చూర్ణం చేసి, చిటికెడు ఉప్పు వేసి మీ స్వంత పంటి నొప్పిని తగ్గించే పేస్ట్‌ను తయారు చేసుకోండి. ఇలా చేయడం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది.

పసుపు

పసుపులో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో ఉండే కర్కుమిన్, దీర్ఘకాలిక నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కీళ్ల, కండరాల నొప్పిని తగ్గించడానికి, వాపును తగ్గించడంలో సహాయపడే గుణాలున్నాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్, యాంటీ కార్సినోజెనిక్ మీ ఆరోగ్యాన్ని మెరుగు పర్చేందుకు ఉపయోగపడుతుంది. పసుపు, అలోవెరా జెల్‌ను సమాన మొత్తంలో కలపండి. చర్మం దురదలు, కాటులు, పాయిజన్ ఐవీ ప్రభావిత ప్రాంతాలపై నేరుగా పూయండి. నోటిపూత విషయంలో, ఒక చెంచా నీరు, అర టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెలో చిటికెడు పసుపు కలిపి పేస్ట్‌లా చేసి చర్మంపై దురదగా ఉండే ప్రాంతంలో పూయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉటుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్‌లో అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరంలో ద్రవ సమతుల్యతను నియంత్రించడంలో సహాయపడతాయి. తద్వారా నిర్జలీకరణం, కండరాల నొప్పి, తిమ్మిరిని నివారిస్తుంది. కండరాల తిమ్మిరిని నివారించడానికి ఉపయోగపడుతుంది. రాత్రిపూట కాలు తిమ్మిరిని నివారించడానికి, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, తేనె, ఒక టేబుల్ స్పూన్ కాల్షియం లాక్టేట్ కలపండి. ప్రతిరోజూ నిద్రవేళకు 30 నిమిషాల ముందు తాగాలి. అలాగే గుండెల్లో మంటగా ఉన్నట్లయితే భోజనం తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఏసీవీని ఒక గ్లాసు నీటిలో కలిపి తాగడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

High Protein Lentils: ఈజీగా బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఈ పప్పు దినుసులను ఆహారంలో చేర్చుకోండి..

Weight Loss Tips: ఎక్కువ సేపు నిద్రపోతే బరువు తగ్గుతారట.. పరిశోధనలో షాకింగ్‌ నిజాలు..