AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panipuri Water: పానీపూరీ నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గుతారా..? నిపుణులు ఏమంటున్నారు..?

Panipuri Water: చాలా మంది పానీపూరీని ఇష్టపడుతుంటారు. మంచి మసాలాలు, కారంతో కూడి ఘాటుగా ఉండటంతో పానీపూరీని తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు..

Panipuri Water: పానీపూరీ నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గుతారా..? నిపుణులు ఏమంటున్నారు..?
Subhash Goud
|

Updated on: Feb 14, 2022 | 6:59 PM

Share

Panipuri Water: చాలా మంది పానీపూరీని ఇష్టపడుతుంటారు. మంచి మసాలాలు, కారంతో కూడి ఘాటుగా ఉండటంతో పానీపూరీని తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. పిల్లలు కూడా ఎంతో ఇష్టపడుతుంటారు. మన దేశంలో ఎక్కువగా పానీపూరీ స్టాల్స్‌ ఉంటాయి. అయితే కొందరు పానీపూరీ అనారోగ్యకరమైనదని చెబుతున్నా.. ఆరోగ్యానికి మంచిదేనంటున్నారు మరి కొంత మంది నిపుణులు. పానీపూరీ తినడం వల్ల బరువు తగ్గడంతోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. పానీపూరిలో ఉపయోగించే నీరు చాలా వేడిగా, కారంగా, రుచిగా ఉంటుంది. ఇది ఆకలి కాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. అయితే అలసట నుంచి బయటపడేందుకు, బరువు తగ్గడానికి ఇంట్లో తయారు చేసిన పానీపూరీ తీసుకుంటే మంచిదని డైటీషియన్లు సలహా ఇస్తున్నారు. మీరు పానీపూరితో జీలకర్ర, పుదీనా నీటిని కూడా ఉపయోగించవచ్చు. ఇంట్లో తయారు చేసిన పానీపూరీ జీర్ణక్రియను మెరుగు పరుస్తుందట. పుదీనా, జీలకర్రను నీటిలో కలుపుకోవడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

జీలకర్ర, పుదీనా అనుసంధానం చేసిన పానీ పూరీని తీసుకోవడం వల్ల శరీరానికి కూడా ఎంతో ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే పానీపూరి నీరుతో పాటు జీలకర్ర, పుదీనా, చింతపండు రసం కలిగి ఉంటుంది. మార్కెట్లో లభించే రెడీ టు మిక్స్‌ పానీ పూరీ మసాలాలో రాక్‌ సాల్ట్‌, ఎండు మామిడి, జీలకర్ర, కారం, బ్లాక్‌ సాల్ట్‌, పుదీనా, నల్ల మిరియాలు, ఎండు అల్లం, చింతపండు రసం, సిట్రిక్‌ యాసిడ్‌లు ఉంటాయి. అయితే పానీపూరీ నీటికి రుచిని జోడించేందుకు ఉప్పును పెద్ద మొత్తంలో ఉపయోగిస్తారు. పుదీనా నీరు బరువు తగ్గేందుకు అద్భుతంగా పని చేస్తుందంటున్నారు. పుదీనా నీరు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పుదీనాలో శరీరానికి అవసరమైన ఫైబర్‌, విటమిన్‌ ఏ, ఐరన్‌, మాంగనీస్‌, ఫోలేట్‌ ఉంటాయి. జీలకర్ర కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఒక చిన్న గ్లాసులో నానబెట్టిన జీలకర్ర నీరు కడుపు సంబంధిత వ్యాధులను నయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి పానీ పూరీ పానీని తీసుకుంటే ఎంతో ఉపయోగమని ఓ పోషకాహార నిపుణులు తెలిపాడు. ఇక పానీపూరీలో రవ్వ, మైదాతో తయారు చేసినది శరీరానికి మంచిది కాదంటున్నారు. అయితే పానీపూరీని తయారు చేసేవారు శుభ్రత పాటించకపోవడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

Health Tips: మీకు ఈ సమస్యలు వెంటాడుతున్నాయా..? వంట గదిలో ఉండే వాటితో అద్భుతమైన ఫలితాలు

High Protein Lentils: ఈజీగా బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఈ పప్పు దినుసులను ఆహారంలో చేర్చుకోండి..