AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Tips: చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

చలికాలం(winter)లో జలుబు(Cold), ఫ్లూ , ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ఎక్కువ ఉంటుంది...

Winter Tips: చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
Hot Water
Srinivas Chekkilla
|

Updated on: Feb 15, 2022 | 7:00 AM

Share

చలికాలం(winter)లో జలుబు(Cold), ఫ్లూ , ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ఎక్కువ ఉంటుంది. ఈ సీజన్‌లో చలి నుంచి విముక్తి పొందడానికి ప్రజలు వెచ్చని బట్టలు, వేడినీరు(hot water), టీ-కాఫీ వంటి వాటిని స్వీకరిస్తారు. అలాగే వేడి నీటితో స్నానం చేస్తారు. గ్లిజర్ వేసుకుని ఎక్కువ సేపు వేడి నీటితో స్నానం చేస్తే హాయిగా ఉంటుంది. అయితే వేడి నీళ్లతో ఎక్కువసేపు స్నానం చేయడం వల్ల కూడా శరీరానికి హాని కలుగుతుంది.

ఎక్కువ సేపు వేడి నీళ్లతో స్నానం చల్లని వాతావరణంలో ఎక్కువ సేపు వేడి నీళ్లతో స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణుల చెబుతున్నారు. వేడి నీరు కెరాటిన్ అనే చర్మ కణాలను దెబ్బతీస్తుంది. దీంతో చర్మంలో దురద, దద్దుర్లు సమస్యను పెరుగుతుంది.

చలికాలంలో వెచ్చగా ఉండటం మంచిది. కానీ ఎక్కువ బట్టలు ధరించడం మానుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ శరీరంపై ప్రభావం పడుతుంది. మనకు జలుబు వచ్చినప్పుడు, మన రోగనిరోధక వ్యవస్థ తెల్ల రక్త కణాలను (WBC) ఉత్పత్తి చేస్తుంది. ఇది ఇన్ఫెక్షన్, వ్యాధుల నుండి రక్షిస్తుంది. అయితే శరీరం వేడెక్కినప్పుడు రోగనిరోధక వ్యవస్థ తన పనిని చేయలేకపోతుంది.

గమనిక :- ఈ కథనం కేవలం ఇతర వెబ్ సైట్స్.. నిపుణుల సూచనల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దయచేసి వీటిని అమలు చేసే ముందు వైద్యులను సంప్రదించాలి.

Read Also.. Panipuri Water: పానీపూరీ నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గుతారా..? నిపుణులు ఏమంటున్నారు..?