Weight Loss Tips: ఎక్కువ సేపు నిద్రపోతే బరువు తగ్గుతారట.. పరిశోధనలో షాకింగ్‌ నిజాలు..

Weight Loss Tips: ఆధునిక కాలంలో బిజీ షెడ్యూల్‌ వల్ల ఆరోగ్యంపై ఎవ్వరు శ్రద్ధ వహించడం లేదు. దీంతో సమయపాలన లేని తిండివల్ల విపరీతంగా బరువు పెరుగుతున్నారు.

Weight Loss Tips: ఎక్కువ సేపు నిద్రపోతే బరువు తగ్గుతారట.. పరిశోధనలో షాకింగ్‌ నిజాలు..
బరువు తగ్గుతుంది: మీరు రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం చాలా మంచింది. వేడి నీరు బరువు తగ్గడంలో చాలా సహాయపడుతుంది. రాత్రిపూట వేడినీళ్లు తాగాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. వేడినీరు తాగడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరుగుతుందని పేర్కొంటున్నారు.
Follow us
uppula Raju

|

Updated on: Feb 14, 2022 | 2:04 PM

Weight Loss Tips: ఆధునిక కాలంలో బిజీ షెడ్యూల్‌ వల్ల ఆరోగ్యంపై ఎవ్వరు శ్రద్ధ వహించడం లేదు. దీంతో సమయపాలన లేని తిండివల్ల విపరీతంగా బరువు పెరుగుతున్నారు. ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. అధిక బరువు అధిక రక్తపోటు, బ్లడ్ షుగర్, గుండె సంబంధిత వ్యాధులు, మోకాళ్ల నొప్పులు మొదలైన వాటికి కారణమవుతుంది. ఊబకాయాన్ని తగ్గించడంలో నిద్ర సహాయపడుతుంది. యూనివర్శిటీ ఆఫ్ చికాగోలో నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఎక్కువ నిద్రపోవడం వల్ల బరువు తగ్గుతారు

చికాగో విశ్వవిద్యాలయ పరిశోధకులు రోజూ ఒక గంట ఎక్కువ నిద్రపోయే వ్యక్తులు బరువు తగ్గుతారని తేల్చారు. వారి అభిప్రాయం ప్రకారం.. ప్రతి రోజు ఒక గంట ఎక్కువగా నిద్రపోవడం వల్ల అధిక బరువు ఉన్నవారు సంవత్సరంలో 3 కిలోల బరువు తగ్గవచ్చని చెబుతున్నారు. రోజుకు 6.5 గంటల కంటే తక్కువ నిద్రపోయే 21 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల 80 మందిపై ఈ పరిశోధన నిర్వహించారు.

అధ్యయనం చేసిన వ్యక్తులు మొదట స్మార్ట్ వాచ్‌లతో వారి నిద్ర విధానాలను తనిఖీ చేసి ఆపై మూత్రం నుంచి వారి క్యాలరీలను ట్రాక్ చేస్తారు. రోజుకు 1.2 గంటలు అంటే 1 గంట, 20 నిమిషాల కంటే ఎక్కువ నిద్రపోయే వ్యక్తులు 270 తక్కువ కేలరీలు ఖర్చుచేస్తారని పరిశోధనలో తేలింది. ఇలా చేయడం ద్వారా ఒక సంవత్సరంలో 4 కిలోల వరకు తగ్గించవచ్చని అధ్యయనం పేర్కొంది. ఎక్కువసేపు నిద్ర పోవడం ఎక్కువ రోజులు కొనసాగించినట్లయితే బరువు తగ్గవచ్చు. చాలా మంది వ్యక్తులు బరువు తగ్గడానికి కేలరీలను తీసుకోవడం తగ్గిస్తారు. అయితే ప్రతిరోజూ కేవలం కొన్ని గంటల ఎక్కువ నిద్రపోతే చాలు బరువు దానంతటే అదే తగ్గుతుందని ఈ పరిశోధన ద్వారా తెలుస్తుంది.

PM Kisan: రైతులకు గమనిక.. ‘పీఎం కిసాన్‌’ కింద కుటుంబంలో ఎంతమంది లబ్ధి పొందవచ్చు..?

Riding Bike: బైక్‌పై వెళ్లేటప్పుడు కరోనా రావొద్దంటే ఈ 4 జాగ్రత్తలు తప్పనిసరి.. అవేంటో తెలుసుకోండి..?

Valentine Day 2022: ప్రేమికుల రోజున ఈ 5 బహుమతులు ఎవ్వరికి ఇవ్వొద్దు.. ఎందుకో తెలుసా..?