Riding Bike: బైక్‌పై వెళ్లేటప్పుడు కరోనా రావొద్దంటే ఈ 4 జాగ్రత్తలు తప్పనిసరి.. అవేంటో తెలుసుకోండి..?
Riding Bike: మధ్య తరగతి ప్రజలు బయటికి రావాలంటే ఎక్కువగా బైక్‌ని ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది బడ్జెట్‌లో లభిస్తుంది. కాబట్టి దాదాపుగా అందరు మెయింటెన్ చేస్తారు. అయితే
Riding Bike: మధ్య తరగతి ప్రజలు బయటికి రావాలంటే ఎక్కువగా బైక్‌ని ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది బడ్జెట్‌లో లభిస్తుంది. కాబట్టి దాదాపుగా అందరు మెయింటెన్ చేస్తారు. అయితే ఈ కరోనా కాలంలో బైక్‌పై ప్రయాణించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి తెలియకుండానే కరోనా సోకే అవకాశం ఉంది. అందుకే బైక్‌పై ప్రయాణించేటప్పుడు కొన్ని ప్రత్యేక పద్దతులను అవలంభించాలి. వాటి గురించి తెలుసుకుందాం.
1. కచ్చితంగా మాస్క్ ధరంచాలి
మోటార్‌సైకిల్‌పై వెళ్లేటప్పుడు వైరస్ బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా మాస్క్ ధరించాలి. లేదంటే గాలిలో కలిసి ఉన్న వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు నాణ్యమైన మాస్క్ ధరించాలి. వీలైతే డబుల్ మాస్క్‌ను పెట్టుకుంటే మంచిది. అంతేకాకుండా ఒకసారి ఉపయోగించిన మాస్క్‌ను మళ్లీ ఉపయోగించవద్దు.
2. రద్దీ ప్రాంతాలను నివారించండి
రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చాలా రకాల వ్యక్తులు అక్కడికి వస్తుంటారు. అందులో వ్యాధి సోకిన వ్యక్తులు కూడా ఉండవచ్చు. ఈ పరిస్థితిలో మోటారుసైకిల్ నడుపుతున్నప్పుడు రద్దీగా ఉండే ప్రదేశాల నుంచి కాకుండా వేరే ఏదైనా మార్గం ఉంటే అక్కడి నుంచి వెళ్లాలి. అలాంటి మార్గం ఏది లేదంటే మాస్క్ ధరించి నెమ్మదిగా జాగ్రత్తగా వెళ్లాలి.
3. హెల్మెట్ కచ్చితం
మోటార్ సైకిల్ నడుపుతున్నప్పుడు ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే కచ్చితంగా హెల్మెట్ ధరించాలి. ఇది గాలిలో ఉండే వైరస్ నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. అంతేకాదు రోడ్డు ప్రమాదాల నుంచి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది.
4. శానిటైజర్ వాడాలి
మోటార్ సైకిల్ రెండు హ్యాండిల్స్‌ను శానిటైజర్‌తో శుభ్రం చేయాలి. ప్రయాణం ముగిసిన తర్వాత మీ చేతులను శానిటైజ్ చేసుకోవాలి. లేదంటే దీని వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.