AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: రోడ్ల పక్కన దాబాల్లో మద్యం బంద్.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

CM Jagan Review: రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవారికి తక్షణ వైద్యం అందించడంపై సీఎం మీటింగ్‌లో  చర్చించారు. ప్రమాదాలకు గురైన వారి ప్రాణాలు కాపాడటంలో 108లు కీ రోల్ పోషిస్తున్నాయని సీఎంకు అధికారులు తెలిపారు.

Andhra Pradesh: రోడ్ల పక్కన దాబాల్లో మద్యం బంద్.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
Cm Jagan
Ram Naramaneni
|

Updated on: Feb 14, 2022 | 5:25 PM

Share

CM Jagan: సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన రోడ్డు సెఫ్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. పోలీసు, ట్రాన్స్‌పోర్ట్, హెల్త్‌, రోడ్‌ ఇంజినీరింగ్‌ విభాగాల నుంచి నిపుణులతో లీడ్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు.  ప్రమాద బాధితులకు చికిత్స కోసం క్యాష్‌లెస్‌ ట్రీట్‌ మెంట్‌ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్యాష్ లెస్ ట్రీట్​మెంట్ ఇచ్చే నెట్‌వర్క్‌ ఆస్పత్రుల లిస్ట్ తయారు చేసి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పారు. రోడ్‌ సేఫ్టీ ఫండ్‌ ఏర్పాటునకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రోడ్డు ప్రమాదాల్లో(Road Accidents) గాయపడ్డవారికి తక్షణ వైద్యం అందించడంపై సీఎం మీటింగ్‌లో  చర్చించారు. ప్రమాదాలకు గురైన వారి ప్రాణాలు కాపాడటంలో 108లు కీ రోల్ పోషిస్తున్నాయని సీఎంకు అధికారులు తెలిపారు. గోల్డెన్ అవర్‌లోగా పేషెంట్లను ఆస్పత్రులకు చేర్చుతూ క్షతగాత్రుల ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న 16 మెడికల్‌ కళాశాలల్లోనూ ట్రామా కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అత్యాధునిక పద్ధతుల్లో ఎమర్జెన్సీ సర్వీసులు అందించాలన్నారు. ప్రమాదాలకు గురైన వారు కోలుకునేందుకు వీలుగా వైజాగ్​(Vizag)లో రీహాబిలిటేషన్‌ సెంటర్‌ను ఉంచాలన్నారు.

తిరుపతి బర్డ్‌ ఆస్పత్రుల్లో ఉన్న సెంటర్‌ను మెరుగుపరచాలని సీఎం సూచించారు. రోడ్డుపై లైన్‌మార్కింగ్‌ స్పష్టంగా ఉండేలా చూడాలన్నారు. బైక్‌లకు, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేకంగా లైన్లు ఏర్పాటు చేయడంపై ఆలోచించాలన్నారు. రోడ్లపై ఎంత వేగంతో వెళ్లాలో సూచిస్తూ సైన్‌ బోర్డులు తప్పకపెట్టాలని, ఫలితంగా చాలా వరకు ప్రమాదాలు తగ్గే ఛాన్స్ ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు.  రోడ్ల పక్కన దాబాల్లో మద్యం అమ్మకుండా కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ విధానాన్ని పునఃసమీక్షించాలని సీఎం పేర్కొన్నారు.  జిల్లాల వారీగా ఏర్పాటవుతున్న కమిటీలు.. రోడ్డు ప్రమాదాలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ తగిన నివారణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఐరాడ్‌ యాప్‌ వినియోగించుకుని ప్రమాదాలపై లైవ్‌ అప్‌డేట్‌ పొందేలా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

కాగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రహదారి ప్రమాదాలు, కారణాల గురించి సీఎంకు అధికారులు వివరాలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1190 బ్లాక్‌ స్పాట్స్‌ గుర్తించామని నివేదించారు. 520 స్పాట్స్‌ను రెక్టిఫై చేశామని పేర్కొన్నారు. ఆర్‌అండ్‌బీ నిర్వహిస్తున్న నేషనల్ హైవేల్లోనూ 78 బ్లాక్‌ స్పాట్స్‌ను రెక్టిఫై చేశామన్నారు.

Also Read: పసికందును చంపి ఉరేసుకున్న తల్లి..! పోలీసులు సైతం కన్నీరు.. కానీ చివరి నిమిషంలో

డాక్టర్‌కి కాల్‌చేసి జాబ్‌ అడిగిన ఐఏఎస్‌..! ఆరా తీస్తే అసలు బాగోతం తెలిసింది