Andhra Pradesh: పసికందును చంపి ఉరేసుకున్న తల్లి..! పోలీసులు సైతం కన్నీరు.. కానీ చివరి నిమిషంలో

AP Crime News: విగతజీవులుగా పడి ఉన్న ఇల్లాలు.. మూడు నెలల పసిపాపను చూసి పోలీసులు సైతం కంటనీరు పెట్టినంత పనిచేశారు. ఘటనపై మృతురాలు కుటుంబసభ్యులను ఆరా తీశారు పోలీసులు. అప్పుడే అసలు ట్విస్ట్ వెలుగుచూసింది.

Andhra Pradesh: పసికందును చంపి ఉరేసుకున్న తల్లి..! పోలీసులు సైతం కన్నీరు.. కానీ చివరి నిమిషంలో
Ap Crime News
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 13, 2022 | 6:58 PM

Anantapur district: అనంతపురం జిల్లాలో ఘోరం జరిగింది. కట్టుకున్నోడే కాలయముడయ్యాడు. భార్య, ముక్కుపచ్చలారని మూడు నెలల బిడ్డను గొంతు నులుమి చంపేశాడు. బిడ్డను చంపి ఆపై భార్య ఉరేసుకుని చనిపోయినట్లు ఊరంతా నమ్మించాడు. అంతా నిజమే అనుకున్నారు. ఏమీ ఎరుగనట్టు దొంగ ఏడుపుతో ఊరంతా తిరిగాడు. అనుమానించిన పోలీసులు తమదైన స్టైల్లో విచారించారు. విచారణలో విస్తుపోయే నిజం తెలిసింది. భర్తే.. భార్య, బిడ్డను దారుణంగా చంపేశాడని తేలింది. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు శివారులో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుంది. ఆమె మూడు నెలల చంటిబిడ్డ కూడా విగతజీవిగా పడి ఉండడం స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు పోలీసులు. విగతజీవులుగా పడి ఉన్న ఇల్లాలు.. మూడు నెలల పసిపాపను చూసి పోలీసులు సైతం కంటనీరు పెట్టినంత పనిచేశారు. ఘటనపై మృతురాలు కుటుంబసభ్యులను ఆరా తీశారు పోలీసులు. పాపను చంపి ఉరేసుకుందని చెప్పారు ఆమె బంధువులు. అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే భర్తను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసు విచారణలో తేలింది అసలు నిజం. భార్యాబిడ్డను భర్తే దారుణంగా గొంతు నులిమి చంపినట్లు నిర్ధారించారు పోలీసులు.

వివాహం చేసుకుని నిండా రెండేళ్లు నిండకుండానే నూరేళ్లు నిండాయి ఆ ఇల్లాలుకు. తల్లి కాళ్ల చెంతన నిద్రపోయినట్లుగా ఉన్న చంటిబిడ్డను చూసిన వారంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వీడి చేతులు విరిగిపోను అంటూ శాపనార్థాలు పెడుతున్నారు.

Also Read: భర్తను చంపి గొడ్ల చావిడిలో పాతిపెట్టిన భార్య.. 3వ రోజు దుర్వాసన రావడంతో

మందు మత్తులో మాట తూలాడు.. తెల్లారేసరికి చిప్పకూడు.. మాములు ట్విస్ట్ కాదు

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు