AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మందు మత్తులో మాట తూలాడు.. తెల్లారేసరికి చిప్పకూడు.. మాములు ట్విస్ట్ కాదు

ఈ మధ్య జరిగే క్రైమ్స్ మీరు గమనిస్తున్నారా.. నూటికి 90 శాతం అక్రమ సంబంధాలు, వివాహేతర సంబధాలు చుట్టే తిరుగుతున్నాయి.

Telangana: మందు మత్తులో మాట తూలాడు.. తెల్లారేసరికి చిప్పకూడు.. మాములు ట్విస్ట్ కాదు
Extra Marital Affair
Ram Naramaneni
|

Updated on: Feb 13, 2022 | 6:12 PM

Share

Nizamabad District: ఈ మధ్య జరిగే క్రైమ్స్ మీరు గమనిస్తున్నారా.. నూటికి 90 శాతం అక్రమ సంబంధాలు, వివాహేతర సంబధాలు చుట్టే తిరుగుతున్నాయి. అది ఏ టైప్ క్రైమ్ అయినా సరే లీడ్ మాత్రం తిరిగి అక్కడికే వెళ్తుంది. పచ్చని కాపురాలు.. ఈ సంబంధాలు వల్ల నాశనం అయిపోతున్నాయి. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. తాజాగా ఓ వివాహిత ప్రియుడితో భర్తను హత్య చేయించిన ఘటన  నిజామాబాద్ జిల్లా మద్నూర్‌ మండలం పెద్దఎక్లారలో వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… బిచ్కుంద మండలం కందర్‌పల్లికి చెందిన ఫిరంగి సాయిలు(35)కు 16 ఏళ్ల క్రితం మద్నూర్‌ మండలంలోని పెద్ద ఎక్లారకు చెందిన రుక్మిణితో వివాహం జరిగింది. అయితే డిసెంబర్ నెలలో రుక్మిణి తల్లి మరణించడంతో సాయిలు తన భార్యతో కలిసి అత్తగారింట్లోనే ఉంటున్నాడు. అయితే రుక్మిణి.. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం నెరపుతోంది. భర్తకు తెలియకుండా గుట్టుగా ఈ వ్యవహారం సాగిస్తుంది. ఉన్నట్టుండి..  డిసెంబర్ చివరి వారం నుంచి సాయిలు ఆచూకి మిస్ అయ్యింది. కొడుకు సమాచారం గురించి సాయిలు తల్లి బషవ్వ వాకబు చేసినప్పటికీ.. ఎటు పోయాడో తనకు తెలియదని చెప్పుకొచ్చింది రుక్మిణి. దీంతో బషవ్వ తెలిసిన చుట్టాలు, సన్నిహితుల ఇళ్లల్లో అడిగి చూసింది. ఎవరూ తమ వద్దకు రాలేదని చెప్పారు.

ఇదిలా ఉండగా.. శనివారం రాత్రి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గట్టిగా మందు కొట్టి… ఆ మత్తులో సాయిలును తానే చంపానంటూ గొప్పలు పోయాడు. దీంతో స్థానికులు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. పెద్ద ఎక్లార గ్రామానికి చేరుకుని అతడిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రుక్మిణికి, తనకు అక్రమ సంబంధం ఉందని, తమకు అడ్డుగా ఉన్నాడన్న కోపంతోనే సాయిలును చంపేసి.. పాతిపెట్టినట్లు అతడు పూసగుచ్చినట్లు చెప్పాడు. నిందితుడు తెలిపిన వివరాల మేరకు మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు.

Also Read: భర్తను చంపి గొడ్ల చావిడిలో పాతిపెట్టిన భార్య.. 3వ రోజు దుర్వాసన రావడంతో

Hyderabad: ప్రాణం తీసిన సిగరెట్.. ఊహించని విధంగా ఊపిరి జారిపోయింది