Hyderabad: ప్రాణం తీసిన సిగరెట్.. ఊహించని విధంగా ఊపిరి జారిపోయింది
విధి మనుషుల జీవితాలతో ఎప్పుడు.. ఎలా ఆడుకుంటుందో చెప్పలేం. క్షణ వ్యవధిలోనే ఫేట్ మారిపోతుంది. ఊపిరి జారిపోతుంది. తాజాగా హైదరాబాద్‌లో అలాంటి ఘటనే జరిగింది.
Tragedy: విధి మనుషుల జీవితాలతో ఎప్పుడు.. ఎలా ఆడుకుంటుందో చెప్పలేం. క్షణ వ్యవధిలోనే ఫేట్ మారిపోతుంది. ఊపిరి జారిపోతుంది. తాజాగా హైదరాబాద్‌లో అలాంటి ఘటనే జరిగింది. ఓ అలవాడు వృద్ధుడి ప్రాణాలు తీసింది. సిగరెట్ కాల్చే క్రమంలో ప్రమదవశాత్తూ మంటలు అంటుకుని అతడు మరణించాడు. వివరాల్లోకి వెళ్తే.. మంగళ్‌హాట్(Mangalhat) జిన్సీచౌరాహీ బోరియా గల్లీకి చెందిన మధుకర్(60)కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పక్షవాతం రావడంతో అతడి రెండు కాళ్లు, ఒక చేయి చచ్చుబడిపోయాయి. దీంతో మంచానికే పరిమితమయ్యాడు. అయితే అతడికి సిగరేట్ తాగే అలవాటు ఉంది. ఎంత అనారోగ్యం ఉన్నప్పటికీ.. ఆ సిగరెట్ అలవాటు మాత్రం మానలేకపోతున్నాడు. తాజాగా మధుకర్ భార్య, పిల్లలు అతడికి అన్నం పెట్టి.. ఎవరి పనులకు వారి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న అతడు సిగరెట్ వెలిగించేందుకు ప్రయత్నించగా… నిప్పు రవ్వలు దుప్పటిపై, మంచంపై పడి మంటలంటుకున్నాయి. అతడి కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని మంటలను ఆర్పేపి… ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన అతడు చికిత్స పొందుతూ శనివారం రాత్రి చనిపోయాడు. మంగళ్‌హాట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ఇంజినీరింగ్ కంప్లీట్ చేశాడు.. ఎందులో స్పెషలిస్టో తెలిస్తే.. బుర్ర బ్లాంక్ అవ్వడం ఖాయం