Ramnath Kovind: భక్తి మార్గమే వేల ఏళ్ల నుంచి భారత్‌ను ఏకం చేసింది.. శ్రీ రామనగరంలో ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది..
రామానుజాచార్యుల విగ్రహం ఏర్పాటు చేసిన చినజీయర్ స్వామికి, మైహోం రామేశ్వర రావుకు రాష్ట్రపతి ధన్యవాదాలు తెలిపారు.
రామానుజాచార్యుల విగ్రహం( (Statue Of Equality)) ఏర్పాటు చేసిన చినజీయర్ స్వామికి, మైహోం రామేశ్వర రావుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్(Ram NathKovind) ధన్యవాదాలు తెలిపారు. భక్తి మార్గాన్ని, సమానత్వాన్ని రామానుజాచార్యులు(Ramanujacharya) నిర్దేశించారని చెప్పారు.108 దివ్యదేశాల ఏర్పాటుతో ఆధ్యాత్మికత ఉట్టిపడుతోందన్నారు. ఈ క్షేత్రం ఏర్పాటుతో తెలంగాణలో కొత్త సాంస్కృతిక జీవనం మొదలైందని పేర్కొన్నారు. రామానుజాచార్యుల స్వర్ణ విగ్రహం ఆవిష్కరణతో దేశంలో కొత్త చరిత్ర మొదలైందని చెప్పారు. 120 ఏళ్ల పరిపూర్ణ జీవనం గడిపిన ఘనత రామానుజాచార్యులవారిదని తెలిపారు.
దక్షిణ భారత భక్తి సంప్రదాయాన్ని దేశానికి పరిచయం చేసిన ఘనత రామానుజాచార్యులకే దక్కిందన్నారు. అళ్వార్వుల ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పారని పేర్కొన్నారు. భగవంతుని దర్శనానికి పూజారి అవసరం లేదని రామానుజాచార్యుల వారు ఆనాడే చెప్పారని వివరించారు. భక్తితో ముక్తి లభిస్తుందని ఆనాడే రామానుజాచార్యుల వారు చెప్పారని గుర్తు చేశారు. భక్తి మార్గమే వేల ఏళ్ల నుంచి భారత్‌ను ఏకం చేసిందని తెలిపారు. శ్రీరంగ నుంచి మొదలైన ఆయన యాత్ర భారతమంతా సాగింది.
అంతకుముందు రామ్ నాథ్ కోవింద్ సతీసమేతంగా ముచ్చింతల్ శ్రీ రామనగరంలోని సమతామూర్తిని సందర్శించుకున్నారు. శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దీంతోపాటు భద్రవేదిలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన 120 కిలోల రామానుజాచార్యుల బంగారు విగ్రహగాన్ని ఆవిష్కరించారు. స్వర్ణ రామానుజాచార్యుల విగ్రహానికి రామ్‌నాథ్ కోవింద్ తొలి పూజ చేశారు. ఆయన ఆశ్రమమంతా కలియ దిరిగారు.108 దివ్యదేశాలను సందర్శించారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులు ఉన్నారు.
Read Also.. CM KCR Press Meet: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్.. లైవ్ వీడియో